డిమాండ్ల సాధనకు జేఏసీతో కలిసి పోరాటం

ABN , First Publish Date - 2022-12-30T00:44:53+05:30 IST

ప్రభు త్వ పెన్షన్‌దారుల డిమాండ్ల సాధనకు రాష్ట్ర జేఏసీ కలిసి పొరాడుతామని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ వెంకటేశ్వర్లు పిలుపు ని చ్చారు. ఒంగోలు నగరం పులి వెంకటరెడ్డి కా లనీలోగల పెన్షనర్ల భవన్‌లో గురువారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్‌ల జిల్లా వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది.

డిమాండ్ల సాధనకు జేఏసీతో కలిసి పోరాటం
మాట్లాడుతున్న ప్రభుత్వ పెన్షనర్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

ఒంగోలు(రూరల్‌), డిసెంబరు 29 : ప్రభు త్వ పెన్షన్‌దారుల డిమాండ్ల సాధనకు రాష్ట్ర జేఏసీ కలిసి పొరాడుతామని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ వెంకటేశ్వర్లు పిలుపు ని చ్చారు. ఒంగోలు నగరం పులి వెంకటరెడ్డి కా లనీలోగల పెన్షనర్ల భవన్‌లో గురువారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్‌ల జిల్లా వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో వెంకటే శ్వర్లు మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధిం చుకున్న క్వాంటమ్‌ పెన్షన్‌ను వైసీపీ ప్రభు త్వం తగ్గించడం సరికాదన్నారు. 70 సంవత్స రాలు దాటినవారికి 10 నుంచి 7కు, 75 సంవ త్సరాలు దాటినవారికి 15శాతం ఇచ్చే క్యాంటం పెన్షన్‌ను 12 శాతానాకి తగ్గించడం అన్యాయ మన్నారు. నెలనెలా 1వ తేదీ నాటికి పెన్షన్‌ జమచేయాలని డిమాండ్‌ చేశారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి ప్రభుదాసు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు 66 రోజులు సమ్మె చేసి డిమాండ్లు సాధించుకున్నారన్నారు. డీఏ ఇవ్వ కుండానే ఇచ్చినట్లు చూపి పెన్షన్‌ నుంచి ట్యాక్స్‌ కట్‌ చేయడమేంటన్నారు. కట్‌ చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలన్నారు. మెడికల్‌ బిల్లులను వెంటనే ఇవ్వాలన్నారు. ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్‌ బాబు మాట్లాడుతూ వైసీపీ వచ్చాక జీతాలు, పెన్షన్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటమే శరణ్యమని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా ఖజానా అధికారి ఎ.జగన్నాథరావు, ఏటీవో కె.రాజ్‌కుమార్‌ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు బడే అంకిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వీ పున్నయ్య, కార్యదర్శి డాక్టర్‌ కంచర్ల సుబ్బారావు, అసోసియేట్‌ అధ్యక్షుడు రామకృష్ణ, 300 మంది పెన్షన్‌దారులు, 75 ఏళ్లు దాటిన పెన్షనర్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

Updated Date - 2022-12-30T00:44:53+05:30 IST

Read more