వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి

ABN , First Publish Date - 2022-09-26T04:40:18+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోక అధోగతి పాలవుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారాణి అన్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి
బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు

కల్లబొల్లి మాటలతో మభ్యపెడుతున్న ప్రభుత్వం

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారాణి ధ్వజం

గొల్లపూడి(పర్చూరు), సెప్టెంబరు 25: వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోక అధోగతి పాలవుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారాణి అన్నారు. పర్చూరు మండలంలోని గొల్లపూడి గ్రా మంలో ఆదివారం టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌ ఆధ్వ ర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ అని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కల్లబొల్లి మాటలతో ప్రజను మభ్య పెట్టి కాలం వెల్లబుచ్చుతున్నారని  అన్నారు. షంషుద్దీన్‌ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలతోపాటు కరెంట్‌, బస్సు చార్జీలను పెంచి ప్రజలకు పెనుభారంగా ప్రభుత్వం మారిందన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపుతూ విధ్వంసం, అరాచక పాలన సాగిస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో మళ్ళీ స్వర్ణయుగం రావాలంటే  చంద్రన్న పాలన రావాలన్నారు. ప్రజలు వైసీపీ పాలనపై విసుకు చెందారని, ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పా రు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధాలనకు సంబంధించిన కరపత్రాలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. 

కార్యక్రమంలో పార్టీ నాయకులు కొరిటాల సురేష్‌బాబు, వెంకటసు బ్బయ్య,  దొప్పలపూడి ఆదినారాయణ, మానం హరిబాబు, షేక్‌ జమా లుద్దీన్‌, జొన్నలగడ్డ శేషగిరిరావు, కారుమంచి కృష్ణ, అగ్నిగుండాల వెం కటకృష్ణారావు, శ్రీరాం వెంకటసుబ్బారావు, కొండ్రగంటి శివనాగేశ్వర రావు, అడ్డగడ సాంబశివరావు, కాపు రవిచంద్ర, షేక్‌ హుస్సేన్‌, అప్ప లనేని వెంకటేశ్వర్లు, నాయుడు శ్రీనివాసరావు, హైటెక్‌ సుభానీ, కొమ్మన బోయిన శ్రీనివాసరావు, గంజి బ్రహ్మం, సుశీలరావు, మార్కు జాన్‌డేవి డ్‌, కూరాకుల నాగేశ్వరరావు, భీమినేని బాలయ్య, దాసి కిరణ్‌, తమ్ము లూరి శివ తదితరులు పాల్గొన్నారు. 


Read more