టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-15T05:30:00+05:30 IST

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నియోజకర్గ ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య, ఆయన తనయుడు అమర్‌ నాఽధ్‌ అన్నారు.

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి
బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎం కొండయ్య

నియోజకవర్గ ఇన్‌చార్జి కొండయ్య

చీరాల, ఆగస్టు 15: టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నియోజకర్గ ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య, ఆయన తనయుడు అమర్‌ నాఽధ్‌ అన్నారు.  బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి మండల పరిధిలోని గవినివారిపాలెం పంచాయతీ పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు సమిష్టిగా ముందుకుసాగుదామన్నారు.  జే ట్యాక్స్‌తో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయన్నారు. బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

కాగా, సోమవారం ఉదయం గవినివారిపాలెం పంచాయతీ కార్మి కులు పడిపోయిన, అడ్డుగా ఉన్న ప్లెక్సీలను తొలగించటం ప్రారంభిం చారు. టీడీపీ గ్రామ అధ్యక్షుడు నక్కట వెంకటేశ్వర్లు(పండు), నాగరా జు ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారంటూ వారిని ప్రశ్నించారు. పంచాయతీ అధికారులు చెప్పిన మాటమీద తాము తొలగిస్తున్నామని కార్మికులు చెప్పారు. ఈ నేపధ్యంలో వారి మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. ఈపురుపాలెం పోలసులకు అందిన సమాచారం మేరకు వెంకటేశ్వర్లు(పండు), నాగరాజులును స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఇన్‌చార్జి కొండయ్య కుమారుడు అమర్‌నాధ్‌ మరికొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్‌కు వెళ్లి తమవారిని విడిచిపెట్టాలని కోరారు.  

పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరైన కొండయ్య స్ధానికంగా జరిగిన సంఘ టనల సమాచారం అందుకుకుని ఈపురుపాలెం పోలీస్‌స్టేషన్‌కు చేరు కున్నారు. సీఐ మల్లికార్జునరావు ఇరువర్గాలను విచారించిన మీదట చేసిన సూచనల మేరకు ఎస్సైన జనార్దన్‌ ఇరు వర్గాల నుంచి రాజీ ఒప్పంద పత్రం రాపించుకుని వారిని పంపించారు.


ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వం 

తిమ్మరాజుపాలెం(పర్చూరు), ఆగస్టు 15: సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజ లపై భారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో సోమవారం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆ పార్టీ మం డల అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్య మంటూ గద్దెఎక్కి నేడు ప్రజలకు పెనుభారంగా వైసీపీ ప్రభుత్వం మారిందన్నారు. తొలుత ఎస్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మానం హరిబాబు, మామిడిపాక హరిప్రసాద్‌, కొండ్రగంటి శివనాగేశ్వరరావు, అప్పలనేని నరేంద్ర, షేక్‌ హుస్సేన్‌, రామకృష్ణ, మీరావలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T05:30:00+05:30 IST