ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ప్రత్యేక విభాగాలు
ABN , First Publish Date - 2022-10-08T04:17:12+05:30 IST
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు నగరపంచాయతీ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాలలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. అద్దంకి పట్టణ పరిధిలోని గ్రాడ్యుయేట్లు నగరపంచాయతీ కార్యాలయంలో, రూరల్ మండల పరిధిలోని గ్రాడ్యుయేట్ లు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విభాగాలలో దరఖాస్తులు నవంబరు 7 వ తేదీ లోపు అందజేయాలని కమిషనర్ రవికుమార్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కరరెడ్డిలు తెలిపారు.
అద్దంకి, అక్టోబరు 7 : గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు నగరపంచాయతీ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాలలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. అద్దంకి పట్టణ పరిధిలోని గ్రాడ్యుయేట్లు నగరపంచాయతీ కార్యాలయంలో, రూరల్ మండల పరిధిలోని గ్రాడ్యుయేట్ లు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విభాగాలలో దరఖాస్తులు నవంబరు 7 వ తేదీ లోపు అందజేయాలని కమిషనర్ రవికుమార్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కరరెడ్డిలు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని విజయభాస్కరరెడ్డి ప్రారంభించారు. ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు శుక్రవారం తన ఎమ్మెల్సీ దరఖాస్తును కమిషనర్ రవికుమార్‌కు అందజేశారు.