డెంగ్యూతో పెద్దదోర్నాల ఎంపీపీ తనయుడు మృతి

ABN , First Publish Date - 2022-10-08T03:38:42+05:30 IST

పెద్దదోర్నాల ఎంపీపీ గుమ్మా పద్మజ కుమారుడు ధీరజ్‌ (7) డెంగ్యూ బారిన పడి మృతి చెందాడు.

డెంగ్యూతో పెద్దదోర్నాల ఎంపీపీ తనయుడు మృతి

డెంగ్యూతో పెద్దదోర్నాల ఎంపీపీ తనయుడు మృతి

పెద్దదోర్నాల, అక్టోబరు 7 : పెద్దదోర్నాల ఎంపీపీ గుమ్మా పద్మజ కుమారుడు ధీరజ్‌ (7)  డెంగ్యూ బారిన పడి మృతి చెందాడు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. ధీరజ్‌ నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతడిని తల్లిదండ్రులు మార్కాపురంలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం ధీరజ్‌ మృతిచెందాడు. దీంతో  ఎంపీపీ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, వైసీపీ, టీడీపీ నాయకులు ఎంపీపీ పద్మజను పరామర్శించారు.

Updated Date - 2022-10-08T03:38:42+05:30 IST