మట్టి, పుచ్చులు!

ABN , First Publish Date - 2022-11-26T00:12:59+05:30 IST

రైతు భరోసా కేంద్రంలో కొనుగోలు చేసిన సబ్సిడీ శనగల్లో (తెల్ల శనగల్లో) మట్టి, పుచ్చులు, పుల్లలు ఉండటంతో రైతులు అయోమయానికి గురయ్యారు. శుక్రవారం కరవదికి చెందిన రైతులు ఆర్బీకేలో విత్తన శనగలు కొనుగోలు చేసి ఇళ్లకు చేర్చుకున్నారు. వీటిని సంచి నుంచి తీసి ఆరబోశారు. వాటిలో ఎక్కువగా మట్టి, పుచ్చులు, చెత్తతో కూడిన పుల్లలు ఉండటంతో అవాక్కయ్యారు.

మట్టి, పుచ్చులు!

సబ్సిడీ విత్తన శనగల్లో ఇదీ పరిస్థితి

కర వది ఆర్బీకే ద్వారా రైతుల కొనుగోలు

ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం

ఒంగోలు(రూరల్‌), నవంబరు 25 : రైతు భరోసా కేంద్రంలో కొనుగోలు చేసిన సబ్సిడీ శనగల్లో (తెల్ల శనగల్లో) మట్టి, పుచ్చులు, పుల్లలు ఉండటంతో రైతులు అయోమయానికి గురయ్యారు. శుక్రవారం కరవదికి చెందిన రైతులు ఆర్బీకేలో విత్తన శనగలు కొనుగోలు చేసి ఇళ్లకు చేర్చుకున్నారు. వీటిని సంచి నుంచి తీసి ఆరబోశారు. వాటిలో ఎక్కువగా మట్టి, పుచ్చులు, చెత్తతో కూడిన పుల్లలు ఉండటంతో అవాక్కయ్యారు. మొత్తం 15మంది రైతులు కొనుగోలు చేసిన 40 క్వింటాళ్ల శనగలు ఇదేవిధంగా ఉన్నాయి. తమకు తిరిగి నాణ్యమైన శనగలు ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు పండించిన పంటను కొనుగోలు చేసేవారు లేకపోవటం, గిట్టుబాటు ధరలు కరువవడంతో ఇబ్బందిపడుతున్న దశలో ఇలా విత్తనాల విషయంలో కూడా మోసం చేయడంపై మండిపడ్డారు. రైతులను ఇలా దగా చేయడం తగదన్నారు. దీనిపై మండల వ్యవసాయాధికారి కిషోర్‌బాబును వివరణ కోరగా రైతులు ఆ శనగలను తిరిగి ఇస్తే నాణ్యమైనవి ఇస్తామని తెలిపారు. అంతా పైనుంచే వస్తాయని, తాము చేయగలిగేదేమీ ఉండదన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

Updated Date - 2022-11-26T00:13:01+05:30 IST