వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు
ABN , First Publish Date - 2022-08-27T06:16:47+05:30 IST
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు.
త్రిపురాంతకం, ఆగస్టు 26: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారికి పొంగళ్లు పెట్టారు. చినమస్తాదేవికి పూజలు నిర్వహించి బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్బంగా సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు పాలంక ప్రసాదశర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని, సత్యనారాయణస్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రదక్షిణలు అనంతరం వ్రతం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
వేంకటేశ్వరస్వామికి పూజలు
పొదిలి రూరల్ : శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావన మాసం చివరి శుక్రవారం సందర్భంగా మహిళా భక్తులు సామూహికంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అత్యంత స్దురంగా అలంకరించి పూజారి మురళీకృష్ణ ఆద్వర్యంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యలు యక్కలి శేషగిరిరావు, మేడా నరసింహారావు, శ్రావణి వెంకటేశ్వర్లు, చంద్ర శేఖర్, లక్ష్మీనారాయణ, పలువురు భక్తులు పాల్గొన్నారు.
గౌరీదేవి అలంకారం
గిద్దలూరు : పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు గౌరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాల లో దేవస్థాన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.