రామాయణ కండ్రికలో వైద్యశిబిరం ఏర్పాటు

ABN , First Publish Date - 2022-09-24T06:30:30+05:30 IST

ఉప్పల పాడు పీహెచ్‌సీ వైద్యశాల పరిధిలోని మాదాల వారిపాలెం, రామాయణకండ్రిక గ్రామాల్లో శుక్ర వారం వైద్యశిబిరం నిర్వహించారు.

రామాయణ కండ్రికలో వైద్యశిబిరం ఏర్పాటు

పొదిలి రూరల్‌ సెప్టెంబరు 23 : ఉప్పల పాడు పీహెచ్‌సీ వైద్యశాల పరిధిలోని మాదాల వారిపాలెం, రామాయణకండ్రిక గ్రామాల్లో శుక్ర వారం వైద్యశిబిరం నిర్వహించారు. విష జ్వరం, డెంగ్యూ జ్వరాలతో ఇద్దరు చిన్నారులు గురు వారం మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యాధికారి సుష్మా ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. జ్వరాలు సర్వే చేసి కాలువల్లో పూడికలు తీయించి ఏఎల్‌వో, ఐఎస్‌ఎస్‌ ద్రావణాన్ని ఫాగింగ్‌ చేశారు. వైద్య శిబిరం కొనసాగుతుందని ఆమె తెలిపారు.  కార్యక్రమానికి జిల్లా క్షయా నివారణ అధికారి టి సురేష్‌కుమార్‌, కనిగిరి డీఎంఅండ్‌ హెచ్‌వో సృజన, ఏఎంవో నాగార్జున రావు, డాక్టర్‌ షాహీ దా, శానిటరి ఇన్స్‌పెక్టర్‌ మారుతీరావు, హెల్త్‌ సూపర్‌వైజర్స్‌ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 

చిన్నారుల మృతితో కదిలిన అధికారులు

గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయని తెలిసినా, వైద్య అధికారులు గానీ, పంచాయతీ అధికారుల్లో గాని చలనం రాలేదు. ఒకే గ్రామం లో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలియగానే పంచాయతీ అధికారులు హుటాహుటిన గ్రామాన్ని సందర్శించి పారిశుద్య కార్యక్రమాలు చేపట్టారు. తెల్లవారు జామునే పంచాయతీ అధికారులు గ్రామంలో కాలువల్లో పూడికతీతలు, బ్లీచింగ్‌, ఫాగింగ్‌ కార్యక్రమాలు నిర్వహించారు. వైద్యధికారులు  రెండు రోజులు వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు ముందే స్పందిస్తే ఈ పరి స్థితి వచ్చేది కాదని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Read more