వైసీపీ నేత కబ్జాను అడ్డుకున్న ఎస్సీలు

ABN , First Publish Date - 2022-08-17T04:44:05+05:30 IST

ఎస్సీలకు చెందిన 30 ఎకరాల పొలాన్ని అధికారాన్ని ఉపయోగించి వైసీపీ నాయకుడు కబ్జా చేయాలని చూస్తున్న యత్నాలను ఎస్సీలు అడ్డుకున్నారు.

వైసీపీ నేత కబ్జాను అడ్డుకున్న ఎస్సీలు
భూ కబ్జాను అడ్డుకున్న టీడీపీనేత దాసరి మల్లికార్జున, ఎస్సీలు

30 ఎకరాల పొలాన్ని ఆక్రమించేందుకు అధికారం అండతో యత్నం


సీఎ్‌సపురం, ఆగస్టు 16 : ఎస్సీలకు చెందిన 30 ఎకరాల పొలాన్ని అధికారాన్ని ఉపయోగించి వైసీపీ నాయకుడు కబ్జా చేయాలని చూస్తున్న యత్నాలను ఎస్సీలు అడ్డుకున్నారు. మండలంలోని డీజీపేట పంచాయతీ బోడావులదిన్నె గ్రామానికి చెందిన 20 ఎస్సీ కుటుంబాలకు చెందిన 30ఎకరాల పొలాన్ని గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఆక్రమించేందుకు యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సీలు టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లికార్జున సహకారంతో మంగళవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ ప్రస్తుతం ఎస్సీలు ఆ పొలానికి కంచె వేసుకుని విలువైన చెట్లు వేసి ఉన్నారన్నారు. బోడావులదిన్నె గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు అన్నెబోయిన తిరుపతయ్య ఆ పొలాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో సర్వే రాళ్లు, చెట్లు, కంచెను ధ్వంసం చేశారని తెలిపారు. అక్రమంగా పొలాన్ని ఆక్రమించాలని చూస్తున్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశామని చెప్పారు. అధికారులు స్పందించి  వైసీపీ నాయకునిపై చర్యలు తీసుకుని ఎస్సీల పొలాన్ని కాపాడాలని ఆయన కోరారు.


Read more