గ్రానైట్‌ రాళ్లకు సీనరేజీ రూ.1.62 కోట్లు చెల్లింపు

ABN , First Publish Date - 2022-12-15T01:14:38+05:30 IST

రామాయపట్నం పోర్టు రాక్‌ స్పిల్‌వే నిర్మాణానికి తరలిస్తున్న గ్రానైట్‌ రాళ్లకు రూ.1.62కోట్లు సీనరేజీ జమైనట్లు మైన్స్‌ డీడీ జగన్నాఽథరావు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 13లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ రాళ్లు అవసరం ఉన్నట్లు కాంట్రాక్టరు ప్రభుత్వం ద్వారా తమ శాఖను కోరార న్నారు.

గ్రానైట్‌ రాళ్లకు సీనరేజీ రూ.1.62 కోట్లు చెల్లింపు

మైన్స్‌ డీడీ జగన్నాథరావు

ఒంగోలు(క్రైం), డిసెంబరు 14 : రామాయపట్నం పోర్టు రాక్‌ స్పిల్‌వే నిర్మాణానికి తరలిస్తున్న గ్రానైట్‌ రాళ్లకు రూ.1.62కోట్లు సీనరేజీ జమైనట్లు మైన్స్‌ డీడీ జగన్నాఽథరావు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 13లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ రాళ్లు అవసరం ఉన్నట్లు కాంట్రాక్టరు ప్రభుత్వం ద్వారా తమ శాఖను కోరార న్నారు. ఇప్పటి వరకూ 8.40లక్షల క్యూబిక్‌ మీటర్లు తరలించినట్లు తెలిపారు. అందుకు సంబంధించి రూ.7.56కోట్లు మైనింగ్‌ శాఖ కు సీనరేజీ జమ కావాల్సి ఉండగా ఇప్పటికి రూ.1.62కో ట్లు వచ్చిందన్నారు. ఇంకా రూ.6 కోట్ల వరకూ రావాల్సి ఉన్నదన్నారు. అది కూడా ఒక వారంలో అందుతుందన్నారు. క్యూబిక్‌ మీటర్‌కు రూ.90 చొప్పున సీనరేజీ జమ చేస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తాయన్నారు.

Updated Date - 2022-12-15T01:14:39+05:30 IST