ఇసుక బస్తాలోయ్‌.. ఇసుక బస్తాలు

ABN , First Publish Date - 2022-09-27T07:18:23+05:30 IST

నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి ఈ చిత్రం దర్పణం పడుతోంది. నిర్మాణ పనులకు టర్బో లారీలు, ట్రక్కుల్లో తెచ్చుకొనే ఇసుకను బస్తాల్లో తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది.

ఇసుక బస్తాలోయ్‌.. ఇసుక బస్తాలు
ఇంకొల్లు ప్రధాన కూడలిలో విక్రయానికి తీసుకొచ్చిన ఇసుక బస్తాలు

నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి ఈ చిత్రం దర్పణం పడుతోంది. నిర్మాణ పనులకు టర్బో లారీలు, ట్రక్కుల్లో తెచ్చుకొనే ఇసుకను బస్తాల్లో తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది. ఇది ఇసుక దొరకొని ఏ సుదూర ప్రాంతమో కాదు. ఇసుక  అక్రమ, సక్రమ రవాణాకు అడ్డాగా ఉండే కడవకుదురుకు సమీపంలోని ఇంకొల్లులో పరిస్థితి ఉంది. ఇసుక గిరాకీ దృష్ట్య ఓ ఔత్సాహికుడు సిమెంట్‌ బస్తాల్లో ఇసుకను నింపి ఎడ్ల బండిపై ఇంకొల్లు తీసుకొచ్చి ‘ఇసుక బస్తాలే ఇసుక బస్తాలు’ అంటూ విక్రయిస్తున్నాడు. ఈ బస్తాలు కూడా సిమెంట్‌ బస్తాకు పోటీగా రూ.200కు విక్రయించడం గమనార్హం. చిన్న చిన్న మరమ్మతులు చేసే వారు ఈ ధరకు చెల్లించి అనివార్యంగా కొనుగోలు చేయడం గమనార్హం. 

- ఇంకొల్లు

Read more