రోడ్లు ఛిద్రం

ABN , First Publish Date - 2022-10-18T04:06:06+05:30 IST

దర్శి ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు గ్రా మీణ, అంతర్గత రోడ్లు ఛిద్రమయ్యాయి. అనేక చోట్ల రోడ్లు గంటలు పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

రోడ్లు ఛిద్రం
పొతకమూరు-పాపిరెడ్డిపాలెం రోడ్డులో గుంతలు

దర్శి, అక్టోబరు 17 : దర్శి ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు గ్రా మీణ, అంతర్గత రోడ్లు  ఛిద్రమయ్యాయి. అనేక చోట్ల రోడ్లు గంటలు పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కొన్నిచోట్ల అంతర్గత రోడ్లపై నీరు చేరడంతో నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. దర్శి ప ట్టణంలోని అనేక చోట్ల రోడ్లు గంతలమయమయ్యాయి.  ఇప్పటికీ నీరు నిలిచి ఉండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దర్శి గడియార స్తంభం సెంటర్‌లో వర్షపునీరు అలాగే నిలచి ఉండడంతో చిరు వ్యా పారులు నీటిలోనే నిల్చుని వ్యాపారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొతకమూరు - పాపిరెడ్డిపాలెం రోడ్డు వర్షాలకు ఛిద్రమై  గుంతలు పడ్డాయి. దర్శి - ఆరవళ్లిపాడు రోడ్డు అధ్వానంగా మారింది. తూర్పువెంకటాపురం - బండి వెలిగండ్ల గ్రామాల్లో రోడ్లపై నీరు నిల్వ ఉంటుంది. రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కలగడమే కాక దోమల బెడద అధికమైంది.  గత కొద్దిరోజులుగా వర్షాలకు దోమలు ఉత్పత్తి  పెరిగింది. వాటి దాడితో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. కొన్ని పంచాయతీల్లో పారిశుధ్య పనులకు, బ్లీచింగ్‌ చల్లేందుకు నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు రోడ్ల  దుస్థితిని గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.


Updated Date - 2022-10-18T04:06:06+05:30 IST