Road accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురు మృతి

ABN , First Publish Date - 2022-08-08T15:41:13+05:30 IST

జిల్లాలోని కంభం సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లారీని ఓ కారు వెనుక బలంగా ఢీకొట్టింది.

Road accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురు  మృతి

ప్రకాశం: జిల్లాలోని కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. లారీని  ఓ కారు వెనుక బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. మృతులు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు. వీరంతా మాచర్ల నుంచి తిరుమల (Tirumala)కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో అమ్మిరెడ్డి(60), గురవమ్మ(60), అనంతమ్మ(55), మృతులు ఆదిలక్ష్మి(58), నాగిరెడ్డి(24)ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-08-08T15:41:13+05:30 IST