ఆక్రమణ భూముల్లో రాళ్ల తొలగింపు
ABN , First Publish Date - 2022-08-16T06:19:35+05:30 IST
మండలంలోని కోనపల్లె రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 542లో సూమారు 20 ఎకరాలు ఆక్రమించి చుటూ కంచె ఏర్పాటు చేయడంతో గ్రామస్థుల ఫిర్యాదు మేరకు గత నెలలో సర్వేయర్ కొలతలు వేయగా ప్రభుత్వ భూమి అక్రమణ జరిగిందని నిరుపించడంతో అక్రమణ దారునికి వెంటనే నోటీసులు అందజేశారు.

ఆక్రమణ భూముల్లో రాళ్ల తొలగింపు
బేస్తవారపేట,ఆగస్టు15: మండలంలోని కోనపల్లె రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 542లో సూమారు 20 ఎకరాలు ఆక్రమించి చుటూ కంచె ఏర్పాటు చేయడంతో గ్రామస్థుల ఫిర్యాదు మేరకు గత నెలలో సర్వేయర్ కొలతలు వేయగా ప్రభుత్వ భూమి అక్రమణ జరిగిందని నిరుపించడంతో అక్రమణ దారునికి వెంటనే నోటీసులు అందజేశారు.అక్రమణకు గురిచేసిన భూమిలో కంచె రాళ్ళు తొలగించాలని అదేశించారు.అయితే అక్రమదారుడు నిర్లక్ష్యంగా ఉండటంతో సోమవారం ,ఆర్.ఐ, వీఆర్వో తన సిబ్బందితో వేళ్ళి కంచె రాళ్ళు తొలగించి అక్రమణ దారుడు నుండి లిఖితపూర్వకంగా ప్రభుత్వ భూమిని అక్రమణకు గురిచేయనని తీసుకున్నారు. ఈకార్యక్రమంలో ఆర్.ఐ అనిల్ కుమార్,విఆర్వో మీరావలి తదితరులు వేళ్ళి అక్రమణలు తొలగించారు.