-
-
Home » Andhra Pradesh » Prakasam » Purchase of quality goods on behalf of the Devasthanam-MRGS-AndhraPradesh
-
దేవస్థానం తరుపున నాణ్యమైన సరుకులు కొనుగోలు
ABN , First Publish Date - 2022-07-04T05:17:21+05:30 IST
శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవా లయంకు సరఫరా చేసే పలురకాల సరుకులు టెండరుదారులు నాణ్యత లేకుం డా సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పాలకమండలి ఆదివారం సాయంత్రం చైర్మ న్ కోట శ్రీనివాసకుమార్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.

పాలకమండలి నిర్ణయం
శింగరకొండ(అద్దంకి), జూలై 3: శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవా లయంకు సరఫరా చేసే పలురకాల సరుకులు టెండరుదారులు నాణ్యత లేకుం డా సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పాలకమండలి ఆదివారం సాయంత్రం చైర్మ న్ కోట శ్రీనివాసకుమార్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవు నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, యాలుకలు, ఇంగువ, చింత పండు, బియ్యం, పచ్చిశనగపప్పు, జాజికాయలను దేవస్థానం తరపున ఈవో ఆ ధ్వర్యంలో నేరుగా కొను గోలు చేసేవిధంగా నిర్ణయించారు. సమావేశంలో ఈవో రఘనాథరెడ్డి, ధర్మకర్తలు అన్నాబత్తిన సీతారామ య్య, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, జమ్మలమడక రమాదేవి, జ్యోతి చంద్రమౌళి, కుందుర్తి రజనీ, ఎర్రిబోయిన రమణమ్మ, ఎక్స్‌అఫిసియో మెంబర్ కోట లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
షాడోల పెత్తనంపై అభ్యంతరం
అద్దంకి, జూలై3: శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవస్తానం పాలక మం డలిలో షాడోల పెత్తనం పై అధికారులు అభ్యంత రం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. శింగర కొండ పాలక మండ లిలో ఇద్దరు మహిళా సభ్యుల భర్తలు శింగరకొండలో పెత్తనం చెలాయించటంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం జరిగిన పాలకమండలి సమావేశం సమయంలో కూడా మహిళా సభ్యులతో పాటు భర్తలు కూడా దేవస్థానం వద్దకు వచ్చారు. వారు సమావేశంకు రావటంతో ఈవో రఘనాథరెడ్డి అభ్యంతరం చెప్పినట్లు తె లుస్తుంది. ఈ నేపథ్యంలో సమావేశం ముగిసే వరకు బయటకు వెళ్లిన ఇద్దరిని సమావేశం ముగిసిన తరువాత మరలా చైర్మన్ చాంబర్‌లోకి పిలిపించినట్లు తె లుస్తుంది. ఈక్రమంలో ఈవో రఘునాథరెడ్డికి, పాలకమండలిలోని ఓ సభ్యురాలి భర్త మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై ఈవోని వివరణ కోరగా సమావేశంకు సభ్యులు మాత్రమే హాజరయ్యారని, సమావేశం ముగిసిన తరువాత మహిళా సభ్యుల భర్తలు చాంబర్‌కు వచ్చారని తెలిపారు.