ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2022-05-28T06:38:13+05:30 IST
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని శాప్నెట్ చైర్మన్, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య
బల్లికురవ, మే 27: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని శాప్నెట్ చైర్మన్, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తూరు గ్రామంలో పంచాయతీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లను, మురుగు కాలువలను ఆయన ప్రారంభించారు. అనంతరం వేమవరం గ్రామంలో గడప గడపకు మ న ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసు కొన్నారు. ఈ సందర్బంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రతి ఇంటికి ప్ర భుత్వ పథకం వర్తించేలా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళుతుం దన్నారు. ప్రజల సమస్యలు గ్రామాలలోనే పరిష్కారమయ్యే లా సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీడీ వో శ్రీనివాసరావు, ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి, వైస్ ఎంపీపీ సుబ్బారెడ్డి, నేతలు చింతల శ్రీనివాసరావు, సోసైటీ చైర్మ న్లు ఒంగొలు సుబ్బారావు, మార్తాల వెంకారెడ్డి, సర్పంచ్లు దూళిపాళ్ల సుబ్బయ్యచౌదరి, అశ్వినీ, దూళిపాళ్ల బుల్లిరామయ్య, నేతలు గొరంట్ల వెంకటేశ్వర్లు, ముత్యాలరావు, నరేష్, మాదాల శివన్నారాయణ, ఏల్చూరి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
పేద సంక్షేమానికే నవరత్నాలు
మార్టూరు, మే 27: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసమే నవరత్నాలను ప్రవేశపెట్టిందని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ రావి రామనాథం బాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని లక్కవరం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సర్పంచ్ అట్లూరి జెస్సీబాబు, పల్లపాటి శేషయ్య, తాళ్లూరి రామసుబ్బయ్య, జాష్టి వెంకట నారాయణ, వినుకొండ సుధాకర్, గడ్డం మస్తానవలి, పఠాన్ కాలేషావలి, కారచోల సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.