మౌలిక వసతులు కల్పించండి.. పునరావాస కాలనీకి వస్తాం!

ABN , First Publish Date - 2022-12-13T23:25:02+05:30 IST

కనీస మౌలిక వసతులు కూడా కల్పించకుండా పునరావాసకాలనీలో ఎలా ఇళ్ళు నిర్మించుకోవాలని తిమ్మారెడ్డిపాలెం గ్రామస్థు లు పేర్కొన్నారు.

మౌలిక వసతులు కల్పించండి.. పునరావాస కాలనీకి వస్తాం!

గుండ్లకమ్మ ప్రాజెక్టు అధికారులకు తేల్చిచెప్పిన తిమ్మారెడ్డిపాలెం వాసులు

అద్దంకి, డిసెంబరు 13: కనీస మౌలిక వసతులు కూడా కల్పించకుండా పునరావాసకాలనీలో ఎలా ఇళ్ళు నిర్మించుకోవాలని తిమ్మారెడ్డిపాలెం గ్రామస్థు లు పేర్కొన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ముంపు గ్రామాలలో నిర్వహిస్తున్న గ్రామసభలలో భాగంగా మంగళవారం మండలంలోని తిమ్మారెడ్డిపాలెం పున రావాస కాలనీలో గ్రామస్థులతో ప్రాజెక్టు అధికారు లు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్‌ డీసీ ఉమారాణి మాట్లాడుతూ ఇంకా ముంపు గ్రా మాన్ని ఖాళీచేసి పునరావాసకాలనీకి ఎందుకు రాలే దని అడిగారు. పునరావాస కాలనీలో ఇంతవరకు విద్యుత్‌, నీటి సౌకర్యం కల్పించలేదని, సైడ్‌ డ్రైన్‌లు, సీసీ రోడ్లు పూర్తి చేయలేదని తెలిపారు. కనీసం మ రో ఆరు చేతిపంపులు ఏర్పాటుచేయాలని కోరారు. దేవాలయం నిర్మాణం ప్రారంభించినా ఇంత వరకు బిల్లులు చెల్లింపు చేయకపోవటంతో ఆలస్యం అవు తుందని తెలిపారు.

మౌలిక వసతులు కల్పిస్తే పునరావాస కాలనీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామస్థులు తెలిపారు. అదే సమయంలో ఇంకా పరిహారం, ఇళ్ళ స్థలాలు అందని కుటుంబాలకు వెంటనే అందజేయాలని కోరారు. గ్రామస్థుల చెప్పిన సమస్యలు న మోదు చేసుకున్న ఎస్‌డీసి ఉమాదేవి అ న్నీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. తిమ్మారెడ్డిపా లెం వెళ్ళే రోడ్డు బురదగా మారటంతో కొ త్తకొటకలపూడి వరకు వెళ్ళిన అధికారులు వెనుతిరిగి కుంకుపాడు, స్పిన్నింగ్‌ మిల్‌ మీదుగా తిమ్మారెడ్డిపాలెం పునరావాస కా లనీ చేరుకున్నారు. పునరావాసకాలనీ నుంచి తిమ్మారెడ్డిపాలెం వెళ్ళే రోడ్డు కూడా కారు వెళ్ళే వీలులేకపోవటంతో తిమ్మారెడ్డిపాలెంలో ఏర్పా టుచేయాల్సిన గ్రామసభ పునరావాసకాలనీ వద్ద నే ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-12-13T23:25:11+05:30 IST