బాధితుడికి ఆర్థిక సాయం అందజేత

ABN , First Publish Date - 2022-09-12T04:32:47+05:30 IST

దర్శి నగర పంచాయితీ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించారు.

బాధితుడికి ఆర్థిక సాయం అందజేత

దర్శి, సెప్టెంబరు 11 : దర్శి నగర పంచాయితీ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించారు. కార్మికుడు ఇత్తడి ఎర్రవెంకయ్య కొద్దిరోజుల క్రితం పనులు నిర్వహిస్తూ గాయపడ్డాడు. ఇంటి వద్ద వైద్యం పొందుతున్న విషయం తెలుసుకున్న నాయకులు ఆర్థిక సాయం అం దించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మెన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌ చైర్మెన్లు గర్నెపూడి స్టీవెన్‌, తలారి కోటయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, మాజీ సర్పంచ్‌ జీసీ గురవయ్య పాల్గొన్నారు. 


Read more