దొనకొండ రైల్వే స్టేషన్‌లో సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-11-23T00:17:31+05:30 IST
దొనకొండ రైల్వే స్టేషన్‌లో సమస్యల పరి ష్కారానికి చొరవ చూపాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దక్షిణ మ ధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్‌ను కోరారు.
ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్, ఇతర అంశాలపై చర్చ
దొనకొండ, నవంబరు 22 : దొనకొండ రైల్వే స్టేషన్‌లో సమస్యల పరి ష్కారానికి చొరవ చూపాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దక్షిణ మ ధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్‌ను కోరారు. మంగళవారం ప్రత్యేక రై లులో దొనకొండకు చేరుకున్న రైల్వే జీఎం జైన్‌కు ఎంపీ మాగుంట, వైసీ పీ నియోజకవర్గ నాయకుడు మద్దిశెట్టి శ్రీధర్ స్వాగతం పలికారు. అనం తరం రైల్వే కమ్యూనిటీ హాలులో సమావేశమయ్యారు. దొనకొండ రైల్వే స్టేషన్‌లో ఆగని పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని, ప్రజల సౌక ర్యార్థం ఒవర్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై ఎంపీ మాగుంట రైల్వే జీఎంకు వినతిపత్రం అందజేశారు. దీనిపై రైల్వే జీఎం స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుం టామని తెలిపారు. అనంతరం రిటైర్డ్ రైల్వే ఉద్యోగుల సంఘం నాయ కులు జయరాజ్, బీజేపీ మండల అధ్యక్షుడు చీర్ల వెంకటేశ్వర్లు, దొనకొండ సర్పం చ్ కొంగలేటి గ్రేస్ రత్నకుమారి, దేవానంద్, ప్రభు ట్రస్ట్ చైర్మన్ ఆదిమూలపు ప్రభుదాస్, మాజీ కోప్షన్ సభ్యులు షేక్ ముసామియా మరి కొందరు సమస్యలు పరిష్క రించాలని వినతిపత్రాలను రైల్వే జీఎంకు అం దజేశారు. గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు కురిచేడులో హాల్టింగ్ క ల్పించాలంటూ కురిచేడు మండలానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేశా రు. రైల్వే జీఎం రావడం ఆలస్యం కావడంతో గంటసేపు ప్లాట్‌ఫాంలో బల్లపై ఎంపీ మాగుంట కూర్చుని నిరీక్షించారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎంపీ
దొనకొండకు రైల్వే ఉన్నతాధికారులను రప్పించి దీర్ఘకాల సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. దక్షణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ దొనకొండ పర్యట న సందర్భంగా ఎంపీ మాగుంట మంగళవారం దొన కొండ విచ్చేశారు. మాగుంటకు ఎంపీపీ బొరిగొర్ల ఉషా, చందవరం ఎంపీటీసీ సభ్యుడు బీఎస్ రాజు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీ పీలు మిట్టా కోటిరెడ్డి, వడ్లమూడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యుడు సుధా కర్, వైసీపీ నాయకులు కందుల నారపురెడ్డి, పిల్లి ఓబుల్‌రెడ్డి, తమ్మనేని సుబ్బారెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
మార్కాపురాన్ని మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతాం
మార్కాపురం: మార్కాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చి దిద్దుతామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. సాధారణ తనిఖీలలో భాగంగా మంగళవారం ఆయన మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జీఎం అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ మార్కాపురం రోడ్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన చర్యలు తీసుకుంటామన్నారు. డీఆర్‌ఈసీసీ సభ్యులు ఆర్‌కేజీ నరసింహం, పట్టణ ప్యాసింజర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు ఓరుగంటి మల్లిక్‌లు జీఎం ఆరుణ్ కుమార్ జైన్‌కు వినతిపత్రం అందజేశారు. మార్కాపురం రైల్వేస్టేషన్ స్థాయిని గ్రేడ్ 5 నుంచి 4కు మార్చాలని కోరారు. స్టేషన్‌లో ప్లాట్‌ఫాం మారేందుకు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. బీజేపీ నాయకులు కంభం వెంకటరమణ, పైడిమర్రి రామచంద్ర, పీవీ.కృష్ణారావు తదితరులు వినతిపత్రం అందజేశారు. మార్కాపురం స్టేషన్‌లో రెండో ప్లాట్‌ఫాంపై రెండో టిక్కెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
తర్లుపాడు : తర్లుపాడు రైల్వే స్టేషన్ 2వ లైన్ డబ్లింగ్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం తర్లుపాడు రైల్వే స్టేషన్‌లో నెలకొన్న సమస్యలను ప్రయాణికులను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఎస్.భూలక్ష్మీ తర్లుపాడు రైల్వే స్టేషన్‌లో విజయవాడ హుబ్లీ, హుబ్లీ-విజయవాడ, గుంటూరు-సికింద్రాబాద్, గుంటూరు-తిరుపతి టైన్లను తర్లుపాడు రైల్వే స్టేషన్లను ఆపేందేకు చర్యలు తీసుకోవాలని కోరారు. తర్లుపాడులో ని 231 గేట్ వలన ఎక్కువగా ట్రాఫిక్ సమస్య నెలకొంటోందని రైల్వే గేట్‌కు ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని తర్లుపాడులో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని పలువురు ప్రజా ప్రతినిధులు వినతిపత్రాలు సమర్పిం చారు. స్పందించిన జీఎం గుంటూరు-సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ ఆపేందుకు చర్యలు తీసుకుంటామని ప్రయాణి కులకు హామీ ఇచ్చారు. ఈయన వెంట రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.