-
-
Home » Andhra Pradesh » Prakasam » Problem solving in order of priority-MRGS-AndhraPradesh
-
ప్రాధాన్యతాక్రమంలో సమస్యల పరిష్కారం
ABN , First Publish Date - 2022-09-27T05:30:00+05:30 IST
ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు.

ఎమ్మెల్యే కరణం బలరాం
చీరాల, సెప్టెంబరు 27: ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మండల పరిధిలోని జాండ్రపే ట శివాలయం వద్ద వర్షం వచ్చిన ప్రతి సారి రోడ్డుమీద నిలుస్తున్న వర్షపునీటి తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఎమ్మెల్యే బలరాం మంగళవా రం ఆ ప్రాంతాన్ని సందర్శించగా, స్థానిక నాయకులు ఫుఽృధ్వి ధనుంజ య, అంకాళరెడ్డి తదితరులు స్ధానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వర్షపునీరు నిలుస్తున్న ప్రదేశం నుంచి డ్రెయిన్ ఏర్పాటు కు ఉన్న వనరులను పరిశీలించేందుకు సంబంధిత అధికారులను పుర మాయించారు. గ్రామంలో ఉన్న మిగిలిన సమస్యల పరిష్కారానికి కూడా తగిన చర్యలు చేపడతామని చెప్పారు.
స్థానిక ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్ ప్రాంగ ణంలోని ఓఏటీ(ఓపెన్ ఎయిర్ థియేటర్)లో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ చేయూ త కార్యక్రమంలో ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తది తరులు మాట్లాడుతూ ప్రభుత్వపరంగా అంది స్తున్న చేయూతను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో మున్సిపల్ కమిషనర్ మల్లీశ్వరరావు, వైస్‌చైర్మన్లు బొనిగల జైసన్‌బాబు, శిఖాకొల్లి రామసుబ్బులు, పలువురు కౌన్సిలర్లు, అధికారు లు, లబ్ధిదారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.