వైసీపీ వైఫల్యంతోనే విద్యుత్‌ సంక్షోభం

ABN , First Publish Date - 2022-03-06T05:04:43+05:30 IST

వైసీపీ చేతగాని పాలనతోనే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెల కుందని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

వైసీపీ వైఫల్యంతోనే విద్యుత్‌ సంక్షోభం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

టీడీపీ ఆత్మ గౌరవ సభలో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

బేస్తవారపేట, మార్చి 5 : వైసీపీ చేతగాని పాలనతోనే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెల కుందని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని పీవీపురం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన టీడీపీ ఆత్మ గౌరవ సభలో అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. ఎ న్నడూ లేనివిధంగా విద్యుత్‌ బిల్లులను పెంచి పేదలపై ఆర్థిక భారాన్ని మోపారన్నారు. కేంద్రానికి కట్టాల్సిన విద్యుత్‌ బకాయిలను ట్రూ ఆఫ్‌ చార్జీల కింద వసూలు చేయడం దుర్మార్గ మని అశోక్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ బిల్లులపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిందన్నారు. అంతేకాకుండా కోర్టును ఆశ్ర యించిందన్నారు. కోర్టు ఆదేశాల తర్వాత వైసీపీ పాలకులు బుద్ధి తెచ్చుకొని విద్యుత్‌ బిల్లులను తగ్గించారని గు ర్తుచేశారు. టీడీపీ హయాంలో ఎక్కడా కరెంట్‌ కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయడం తోపాటు ప్రజలపై భారాలు పడకుండా చూశా మన్నారు. వైసీపీ వచ్చాక ప్రజలు, రైతులకు కరెంట్‌ కష్టాలు తప్పడం లేదన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి మోసం చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చి మూడే ళ్లయినా ఈ పరిసర గ్రామాల్లో కనీసం రోడ్లు వేసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవన్నారు. ఎంతో ముఖ్యమైన వెలిగొండ, భారీ ప్రాజెక్టు అ యిన పోలవరంను పూర్తి చేయకుండా నిర ్లక్ష్యంగా వదిలేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగాయని అశోక్‌రెడ్డి తెలిపారు.  స భలో గ్రామ సర్పంచ్‌ ఎండేల వెంకటనారాయణరెడ్డి, గుర్రం నయోమి, తమటం వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి,గుంటిక నరసింహ, ఎంపీటీసీ సభ్యుడు పూ నూరు భూపాల్‌రెడ్డి, గుంటిక కొండయ్య, చిం తా దేవభూషణం, శ్రీనివాసరెడ్డి, గురవయ్య, కోటేశ్వరరావు, సోముల వెంకటరెడ్డి, మర్రి ఆంజ నేయులు, దమ్మని బాలయ్య, ఉండేల పవన్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, అబ్దుల్లా, వెంకటరెడ్డి,లక్ష్మీరెడ్డి, రషీద్‌, బాషా, రాము, గడ్డం నాగేశ్వరరావు, అరవ గురవయ్య, సుబ్బారెడ్డి, బాలవెంకటరెడ్డి, పుల్లయ్య, కుంపటి ఇమ్మానియోలు, గుర్రం పోలయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రజలను వంచిస్తున్న పాలకులు

టీడీపీ ఇన్‌చార్జి  ఎరిక్షన్‌బాబు

పెద్దారవీడు (మార్కాపురం) : వైసీపీ పాల కులు ప్రజలను  వంచిస్తున్నారని టీడీపీ వైపా లెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని కొత్తపల్లిలో శనివారం రాత్రి ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో   అభివృద్ధిని పక్కన పెట్టారన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప చేసింది శూన్యమన్నారు. ఏడాదిలోగా వెలిగొండ ద్వారా నీటిని అం దిస్తామని చెప్పిన వైసీపీ ప్రజా ప్రతినిధులు మూడేళ్లయినా ప్రాజెక్టు పూర్తిచేయక, చుక్క నీటిని కూడా అందించలేకపోయారన్నారు. సభలో టీ డీపీ మండలాధ్యక్షుడు మెట్టు శ్రీని వాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వర రావు, మాజీ జడ్పీటీసీలు గుమ్మా గంగరాజు, జడ్డా రవి పాల్గొన్నారు. 




Updated Date - 2022-03-06T05:04:43+05:30 IST