Markapuram Tdp: ధరల బాదుడుతో పేదలకు కష్టాలు

ABN , First Publish Date - 2022-09-29T03:44:01+05:30 IST

వైసీపీ పాలనలో ధరల బాదుడుతో పేదలు, మధ్యతరగతి ప్రజలు కష్టాలపాలవు తు న్నారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

Markapuram Tdp: ధరల బాదుడుతో పేదలకు కష్టాలు
గ్రామంలో పర్యటిస్తున్న మాజీ ఎమ్మెల్యే కందుల

మాజీ ఎమ్మెల్యే కందుల 
మార్కాపురం, సెప్టెంబరు 28 : వైసీపీ పాలనలో ధరల బాదుడుతో పేదలు, మధ్యతరగతి ప్రజలు కష్టాలపాలవు తు న్నారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని  యాచవరం, మొద్దులపల్లి గ్రామాల్లో బుధ వారం బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా  కందుల నారాయణరెడ్డి గ్రామాల్లో ఇంటింటికీ తిరిగా రు. మూడేళ్ల జగన్‌ పాలనలో నిత్యావసరాల ధరలతోపాటు వి ద్యుత్‌ బిల్లులు, ఆర్టీసీ బస్సు చార్జీలు, గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని కందుల ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాల పథకాల అమలు కోసం ప్రజలపై ధరల భారాలు మోపుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వ జమెత్తారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి  వెంకట సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు దూదేకుల మస్తా నయ్య, కౌన్సిలర్‌ యేరువ నారాయణరెడ్డి,  మండలాధ్యక్షుడు జవ్వాజి రామాంజనేయరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు, సర్పంచ్‌ ప్రసాద్‌, నాయకులు లక్ష్మినారాయణ, మాజీ సర్పంచ్‌ తన్నీరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార వైసీపీ విఫల మైం దని కందుల అన్నారు. పట్టణంలోని 22వ వార్డులో బుధవారం నమస్తే మార్కాపురం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను కందుల దృష్టికి తీ సుకువచ్చారు.  కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు, పట్టణ అధ్య క్షుడు షేక్‌ మౌలాలీ, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కా ర్యదర్శి దూదేకుల మస్తాన్‌, తెలుగుయుత దొడ్డా రవి(డి.డి), రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి ఫఠాన్‌ ఇబ్రహిం, మాజీ కౌన్సి లర్లు సయ్యద్‌ గఫార్‌, కొండలు, చిలకపాటి చెన్నయ్య, షేక్‌ మహబూబ్‌ బాష, ఆకుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 
టీడీపీ హయాంలోనే అభివృద్ధి
గిద్దలూరు :  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాం లోనే అభివృద్ధి జరిగిందని  టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని 5వ వార్డులో బుధవారం బాదుడేబాదుడు కార్యక్రమంలో నాయకులు ఇంటింటికి తిరిగి వైసీపీ పాలనలో అక్ర మాలు, పెరిగిన ధరలపై కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బి.చంద్రశేఖర్‌యాద వ్‌, జయలక్ష్మి,  సంపత్‌కుమార్‌రెడ్డి,  పెద్దబాషా పాల్గొన్నారు. 
మూడేళ్లలో అభివృద్ధి శూన్యం
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం :  వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా ఎక్కడా అభివృద్ధి చేయలేదని టీడీపీ ఇన్‌చార్జి గూ డూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని నరసాయపా లెంలో బుధవారం బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహిం చా రు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ  గుర్రం జా షువా జయంతి సభలో జగన్‌ను అంబేడ్కర్‌తో పోల్చడాన్ని ఆయన తప్పుబట్టారు. క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుపోయిన జగ న్‌ను మహనీయులతో పోల్చడం సిగ్గుచేటన్నారు. ఆరు నెలల్లో వెలిగొండను పూర్తి చేసి నీళ్లిస్తామని చెప్పిన వైసీపీ పాలకులు ఇన్నేళ్లయినా పూర్తి చేయలేకపోయారన్నారు. పథకాల పేరుతో పేదలను, మధ్య తరగతి వర్గాలను జగన్‌రెడ్డి నిలువునా ముం చుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలు తీరుస్తుందని, రాష్ట్రాన్ని బాగు చేస్తుందని ఎరి క్షన్‌బాబు  కార్యక్రమంలో రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గోనుగుంట్ల  కోటేశ్వరరావు, టీడీపీ మం డలాధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, వెంకటేశ్వర్లు, షేక్‌ జిలానీ, కంచర్ల సత్యనారాయణగౌడ్‌, తోట మహేష్‌, వేగినాటి శ్రీను,  చిట్యాల వెంగళరెడ్డి, పాలడుగువెంకటకోటయ్య, కొత్త బాస్కర్‌, ఎం మంత్రునాయక్‌, గ్రామ నాయకులు పాల్గొన్నారు. 
Read more