-
-
Home » Andhra Pradesh » Prakasam » Poleramma in splendor poturaju statue is prestigious-MRGS-AndhraPradesh
-
వైభవంగా పోలేరమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2022-08-18T03:49:22+05:30 IST
మండలంలోని బెడుసుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోతురాజు, పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బుధవారం భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

కొమరోలు, ఆగస్టు 17 : మండలంలోని బెడుసుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోతురాజు, పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బుధవారం భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం పోలేరమ్మ అమ్మవారికి, పోతు రాజులకు ప్రత్యేక భోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం గ్రామంలో రామాలయంలో సీతారామస్వాముల విగ్రహాలను వేదపం డితులతో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయం ఆవరణలో ఛండీ హోమాలను దంపతులతో నిర్వహించారు.
పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
మండలంలోని బెడుసుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోతు రాజు, పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ పూజల్లో మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామస్థులు మంగళవాయిద్యాలతో అశోక్‌రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరరం పోలేరమ్మ, పోతురాజుకు ఆయన పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు గోడి ఓబుల్‌రెడ్డి, చలిచీమల శ్రీనివాస చౌదరి, పందరబోయిన గోపాలకృష్ణ యాదవ్, పునుగుపాటి గురవయ్య, బాలి రెడ్డి, సురేష్, రమేష్, పుల్లయ్య, సిద్దయ్య, గుర్రం కృష్ణబాబు పాల్గొన్నారు.