ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-12-16T22:57:11+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌం డ్స్‌లోని సమావేశపు హాలులో శుక్రవారం సీఎ్‌సపురం, పామూరు మండలాలకు చెందిన మం డల, గ్రామ స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో అధికార పార్టీ నేతల అక్రమాలను వివరించారు.

ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే, టీడిపి ఇంచార్జి డాక్టర్‌ ఉగ్ర

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, డిసెంబరు 16 : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌం డ్స్‌లోని సమావేశపు హాలులో శుక్రవారం సీఎ్‌సపురం, పామూరు మండలాలకు చెందిన మం డల, గ్రామ స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో అధికార పార్టీ నేతల అక్రమాలను వివరించారు. ఉగ్ర మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు సాగిస్తున్న అక్రమాలను అడ్డుకోవాలన్నారు. దళితుల, బలహీన వర్గాలకు చెందిన భూములను ఆక్రమించుకుని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. బాధితులకు టీడీపీ నాయకులు అండగా ని లబడి వారికి న్యాయం జరిగేలా పోరాటం చేయాలన్నారు. ఇలాంటి సందర్భాల్లో తన అవసరం అనుకుంటే సమాచారం ఇవ్వాలని చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతులపై వివరాలు నమోదు చేయాలన్నారు. నిత్యావసర ధరలు, ఆయిల్‌, కరెంటు, రవాణా చార్జీలను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తారని, ఇది చంద్రబాబు మాటగా ప్రజలకు తెలియ చేయాలని చెప్పారు. సమావేశంలో సీఎ స్‌పురం, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మనబోయిన వెం కయ్య, నాయకులు షేక్‌ అబ్దుల్లా, దేవెండ్ల తిరుపతయ్య, బీ వెంకటాద్రి, కే శ్రీనివాసులు, కే వెంకటస్వామి, షేక్‌ రజబ్‌బాషా, బీ వెంకటేశ్వ ర్లు, షేక్‌ నాయబ్‌రసూల్‌, తోటా చిన్న, పామూరు మండల పార్టీ అధ్యక్షుడు పు వ్వాడి వెంకటేశ్వర్లు, నాయకులు బొల్లా మాల్యాద్రి చౌదరి, అడుసుమిల్లి ప్రభాకర్‌, జీ శ్రీనివాసులు, ఖాజారహంతుల్లా, హరీష్‌, వై రమేష్‌, రమణయ్య, వైఎస్‌ ప్రసాద్‌రెడ్డి, పీ రామారావు, పాలపర్తి వెంకటేశ్వర్లు, డోలా శేషాద్రి, కంచర్ల శ్రీనివాసులు, నాగమల్లి వెంకటేశ్వర్లు, పీ శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T22:57:13+05:30 IST