పేదల ఆకలి తీర్చడం వరం

ABN , First Publish Date - 2022-09-11T04:47:46+05:30 IST

ఆకలతో ఉన్న వారికి అన్నం పెట్టే అవకాశం రావడం వరం అని అక్షయపాత్ర ఫౌండేషన్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జగన్మోహన్‌ కృష్ణదాస్‌ అన్నారు.

పేదల ఆకలి తీర్చడం వరం

అక్షయపాత్ర డైరెక్టర్‌ జగన్మోహన్‌ కృష్ణదాస్‌

డాక్టర్‌ ఉగ్రకు అభినందనల వెల్లువ

కనిగిరి, సెప్టెంబరు 10: ఆకలతో ఉన్న వారికి అన్నం పెట్టే అవకాశం రావడం  వరం అని అక్షయపాత్ర ఫౌండేషన్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జగన్మోహన్‌ కృష్ణదాస్‌ అన్నారు. పట్టణంలోని పామూరు రోడ్డులో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్‌ను కృష్ణదాస్‌ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన  ఉగ్రను అభినందించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్ల ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల ఆకలిని తీర్చారని ఆయన గుర్తు చేశారు.  ఇతోదికంగా తమ సంస్థకు అవకా శం కల్పించారని గుర్తు చేశారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని అన్న క్యాంటీన్ల సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, దొడ్డావెంకట సుబ్బా రెడ్డి, రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, బారాయిమాం పాల్గొన్నారు.

ఉగ్ర సమక్షంలో పిచ్చాల పుట్టినరోజు వేడుక

టీడీపీ కనిగిరి మండలపార్టీ కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసులరెడ్డి పుట్టినరోజు వేడుకలు  ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర, శ్రేణుల సమక్షంలో శనివారం అమరావతి గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. పుట్టినరోజు కేకును పిచ్చాల కట్‌ చేసి డాక్టర్‌ ఉగ్ర తినిపించారు. మిగతా నాయకులు కేక్‌ను పిచ్చాలకు తినిపించి శుభాకాంక్షులు తెలిపారు. కార్యక్రమంలో దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, బారాయిమాం గాయం తిరుపతిరెడ్డి, వీవీఆర్‌ మనోహరరావు (చిరంజీవి), గవదగట్ల మాలకొండయ్య, సైకం మాలకొండారెడ్డి, బాలు ఓబులరెడ్డి, వీర్ల కిషోర్‌, నజిముద్దీన్‌, చిలకపాటి లక్ష్మయ్య, కేలం ఇంద్రబూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 


Read more