సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ABN , First Publish Date - 2022-02-15T04:37:53+05:30 IST
కంభం పట్టణం హజరత్‌గూడెం పంచాయతీ పరిధిలో పూర్తిగా దెబ్బతిన్న తారు రోడ్డు స్థానంలో రూ.1.45 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు సోమవారం శంకుస్థాపన చేశారు.
కంభం, ఫిబ్రవరి 14 : కంభం పట్టణం హజరత్‌గూడెం పంచాయతీ పరిధిలో పూర్తిగా దెబ్బతిన్న తారు రోడ్డు స్థానంలో రూ.1.45 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు సోమవారం శంకుస్థాపన చేశారు. హజరత్‌గూడెం పంచాయతీ పరిధిలోకి వచ్చే కంభం స్టేట్‌బ్యాంక్ నుంచి పాత ప్రభుత్వ వైద్యశాల వరకు ఉండే తారురోడ్డు పూర్తిగా ఛిద్రమై భారీగా గుం త లు ఏర్పడ్డాయి. ఈ రోడ్డుకు అనేకసార్లు మరమ్మతులు చేసినా ప్రయోజనం లేకపో యింది. దీంతో వాహనదారులు, ప్రజల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే రాంబాబు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.45 కోట్లు మంజూరు చేయించారు. కార్యక్రమంలో ఎం పీపీ చేగిరెడ్డి తులసమ్మ, జడ్పీటీసీ సభ్యుడు కొత్తపల్లి జ్యోతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏ లం వెంకటేశ్వర్లు మాజీ జడ్పీటీసీ సభ్యుడు సయ్యద్ జాకీర్, సర్పంచ్‌లు మహబూబ్‌పీరా, బోడయ్య, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి పాల్గొన్నారు.
రోడ్లకు భూమి పూజ
రాచర్ల : మండల కేంద్రమైన రాచర్లలో రోడ్ల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అన్నా రాంబాబు సోమవారం భూమి పూజ చేశారు. పలుగుంటిపల్లి గ్రామం నుంచి తిమ్మాపురం గ్రామం వరకు రోడ్ల అభివృద్ధి కోసం 1400 మీటర్లకు రూ.5.60 కోట్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొని భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ షేక్ ఖాశింభీ, జడ్పీటీసీ సభ్యుడు పగడాల శ్రీరంగం, ఎంపీటీసీ సభ్యుడు చిట్టెం ఎలిసమ్మ, చప్పిడి శ్రీనివాసులు, సర్పంచ్‌లు పగడాల రమేష్, శిరిగిరి రమేష్, పల్నాటి లతీఫ్, దేవదానం, రేగలగడ్డ రమాదేవి, మార్తోటి లక్ష్మీదేవి, సీఆర్‌ఐ మురళి, సూరా పాండురంగారెడ్డి, పాలుగుళ్ల రంగస్వామిరెడ్డి, ముత్యాల మధు, బెల్లం నాగిరెడ్డి పాల్గొన్నారు.