రహదారి బాగుకు సొంత నిధులు

ABN , First Publish Date - 2022-12-06T22:25:16+05:30 IST

ఎవరో వస్తారని, ఏ దో చేస్తారని ఎదురు చూడక తమ గ్రామంలోని రహ దారిని తానే బాగు చేసి ప్రజల కష్టాలు తీర్చాలన్న ల క్ష్యంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఏకంగా రూ.3 లక్షల తన సొంత నిధులతో రహదారిని బాగుచేశారు.

రహదారి బాగుకు సొంత నిధులు
గ్రావెల్‌ మట్టితో బాగుచేసిన పెదఉల్లగల్లు - పతకమూరు రహదారి (ఇన్‌సెట్‌లో) జిల్లెలమూడి వెంకట్‌, సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌

సొంత ఊరికి సాయపడడంలో ఆనందం

కృతజ్ఞతలు తెలిపిన

పెద్ద ఉల్లగల్లు - పతకమూరు గ్రామస్థులు

ముండ్లమూరు, డిసెంబరు 6 : ఎవరో వస్తారని, ఏ దో చేస్తారని ఎదురు చూడక తమ గ్రామంలోని రహ దారిని తానే బాగు చేసి ప్రజల కష్టాలు తీర్చాలన్న ల క్ష్యంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఏకంగా రూ.3 లక్షల తన సొంత నిధులతో రహదారిని బాగుచేశారు. గోతులు ప డిన 2.5 కిలో మీటర్ల రహదారిని బాగు చేసి ఆ రహ దారి మీదుగా పొలాలకు వెళ్లేందుకు బాగుచేసిన గ్రామ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జిల్లెలమూడి వెంకట్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు, ప్రశంసలు కురిపించారు. పెద్ద ఉల్లగల్లు గ్రామానికి చెందిన జిల్లెల మూడి వెంకట్‌ అమెరికా దేశంలోని టెక్సాస్‌ రాష్ట్రంలోని డొల్లాస్‌ ప ట్టణంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఐతే పెద ఉల్లగల్లు నుంచి పతకమూరు వెళ్లే ప్రధాన రహదారి గత కొన్ని సంవత్సరాల నుంచి మరమ్మతులకు నోచుకోక రైతులు పొ లా లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారి అధ్వాన స్థితిని తెలుసుకున్న వెంకట్‌ రూ.3 లక్షలు సొంత నిధులను వె చ్చించి రెండున్నర కిలో మీటర్ల రహదారికి గ్రావెల్‌ మట్టిని తోలి గో తులను పూడ్చి మట్టిని తోలి చదును చేయించారు. దీంతో పెద ఉల్ల గల్లు గ్రామస్థులతో పాటు పతకమూరు నుంచి పెద ఉల్లగల్లుకు వచ్చే ప్రయాణికుల ఇబ్బందులు కూడా తొలగాయి. వెంకట్‌ తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

గ్రామాభివృద్ధికి పాటుపడతా

గ్రామాభివృద్ధికి తాను ఎల్లప్పుడూ పాటుపడతాను. పుట్టిపెరిగిన గ్రామానికి తనవంతు సేవ చేయడంలో కలిగే తృప్తి జీవితంలో వెల కట్టలేనిది. పెద ఉల్లగల్లు - పతకమూరు రహదారి దుస్థితి ఇటీవల అమెరికా నుంచి ఇంటికి వచ్చినప్పుడు గ్రామస్థులు, రైతులు పడుతున్న ఇబ్బందిని చూశాను. రహదారిని బాగుచేసి వారి సమస్యను పరిష్కరించాను.

- జిల్లెలమూడి వెంకట్‌, సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌, పెద ఉల్లగల్లు

కష్టాలు తీర్చారు

గ్రామానికి చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి జిల్లెలమూడి వెంకట్‌ సొంత నిధులు ఖర్చుచేసి రహదారిని బాగుచేయించి ప్రజల కష్టాలు తీర్చారు. ఈ రహదారి పెద ఉల్లగల్లు - పతకమూరు కావడంతోపాటు నిత్యం పొలాలకు వెళ్తుంటారు. అద్వాన స్థితిలో ఉన్న రహదారిని బాగుచేసిన వెంకట్‌కు గ్రామస్థుల తరఫున కృతజ్ఞతలు.

- కట్టా బ్రహ్మయ్య, గ్రామస్థుడు, పెద ఉల్లగల్లు

చిన్నతనం నుంచే సేవా గుణం

సాప్ట్‌వేర్‌ ఉద్యోగి వెంకట్‌కు చిన్న తనం నుంచే సేవా గుణం ఉంది. ప్రస్తు తం పాలకులు చేయని పనిని వెంకట్‌ చేసి చూపించారు. కొన్ని సంవత్సరాల నుంచి మరమ్మతులకు నోచు కోని రహదారిని బాగుచేసి ప్రజలు, రైతుల కష్టాలు తీర్చారు. వెంకట్‌కు అభినందనలు.

- మధుమంచి శ్రీనివాసరావు, గ్రామస్థుడు, పెద ఉల్లగల్లు

Updated Date - 2022-12-06T22:25:51+05:30 IST