టీడీపీ మండల అధ్యక్షునిగా ఓబుల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-05T05:03:55+05:30 IST

టీడీపీ తాళ్లూరు మండల అధ్యక్షునిగా బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డిని నియమించారు.

టీడీపీ మండల అధ్యక్షునిగా ఓబుల్‌రెడ్డి

తాళ్లూరు, ఆగస్టు 4 : టీడీపీ తాళ్లూరు మండల అధ్యక్షునిగా బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డిని నియమించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నియమించినట్లు టీడీపీ ఒంగోలు పార్టీమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ గురువారం ప్రకటనలో తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను  క్షుణ్నంగా పరిశీలించిన రాష్ట్రపార్టీ తురకపాలెంకు చెందిన  బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డిని నియమించింది. ఓబుల్‌రెడ్డి మన్నేపల్లి సహకార సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ నేతగా కొనసాగుతున్నారు. 

ముండ్లమూరు టీడీపీ అధ్యక్షునిగా కూరపాటి 

ముండ్లమూరు :  టీడీపీ ముండ్లమూరు మండల అధ్యక్షునిగా   శంకరాపుపురం మాజీ సర్పంచ్‌ కూరపాటి శ్రీనివాసరావును నియమిస్తూ టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ గురువారం  ఉత్తర్వులు పంపారు.  శ్రీనివాసరావు టీడీపీలో మంచి నాయకుడిగా పని చేసి ఇటీవల గుర్తింపు పొందారు. తనపై నమ్మకంతో  నియమించిన  నూకసాని బాలాజీకి,  దామచర్ల జనార్దన్‌, దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ విజయానికి కృషి చేస్తానని కూరపాటి తెలిపారు. 


Updated Date - 2022-08-05T05:03:55+05:30 IST