రాజకీయాలపై ఆసక్తి లేదు..!
ABN , First Publish Date - 2022-12-15T00:27:44+05:30 IST
తనకు రాజకీయా లపై ఎటువంటి ఆసక్తి లేదని, ఏ రాజకీయపార్టీకి మద్దతు ఇ చ్చేది లేదని హీరో సుమన్ పే ర్కొన్నారు. బుధవారం ఒంగో లులోని నేతాజీ పబ్లిక్ స్కూ ల్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్య క్రమంలో పాల్గొనటానికి వ చ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
సినీనటుడు సుమన్
ఒంగోలు(కల్చరల్), డిసెం బరు 14: తనకు రాజకీయా లపై ఎటువంటి ఆసక్తి లేదని, ఏ రాజకీయపార్టీకి మద్దతు ఇ చ్చేది లేదని హీరో సుమన్ పే ర్కొన్నారు. బుధవారం ఒంగో లులోని నేతాజీ పబ్లిక్ స్కూ ల్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్య క్రమంలో పాల్గొనటానికి వ చ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను నటనప రంగా ఎంతో బిజీగా ఉన్నట్లు చెప్పారు. సినీ హీరో పవన్‌కళ్యాణ్ రాజకీయాలపై ప్ర శ్నించినప్పుడు సినిమా నటులు రాజకీయాలకు రాకూడదని ఎక్కడా లేదన్నారు. అ దేవిధంగా తన మొదటి సినిమా దగ్గర నుంచి ఈనాటి వరకు సినీపరిశ్రమ ఎంతో అభిమానంతో చూసిందన్నారు. తనకు లభించినదానితో సంతృప్తి చెందే వాడినే తప్ప ఇంకా ఏదో కావాలని అత్యాశపడే మనస్తత్వం కాదని ఆయన పేర్కొన్నారు. ముందు గా ఆయనకు పాఠశాల కరస్పాండెంట్ సీహెచ్.మల్లిఖార్జునరావు, ఉపాధ్యాయ బృం దం, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను సుమన్ ఆసక్తిగా తిలకించి వారితో ముచ్చటించారు.