కురిచేడు పీహెచ్‌సీకి జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2022-10-18T04:11:52+05:30 IST

కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ అవార్డు దక్కింది.

కురిచేడు  పీహెచ్‌సీకి జాతీయ అవార్డు

కురిచేడు, అక్టోబరు 17: కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ అవార్డు దక్కింది. పరిశుభ్రత,  అందిస్తున్న ఉత్తమ సేవలకు గాను జాతీయ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్‌ ధృవపత్నాన్ని అందకున్నది. పీహెచ్‌సీ  వైద్యాధికారి ప్రవీణ్‌ జిల్లా వైద్యాధికారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. పీహెచ్‌సీలో సోమవారం ఏఎన్‌ఎంలు, ఐసీడీఎస్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.  వైద్యాధికారి ప్రవీణ్‌ను లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు,  ఐసీడీఎస్‌ సిబ్బంది, వైద్య సిబ్బంది ఈ సంద ర్భంగా సన్మానించారు.  లయన్స్‌  అధ్యక్షుడు జేబీ రామారావు మాట్లాడుతూ  పీహె చ్‌సీలో రోగులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. కొవిడ్‌ సమయంలో వైద్య సిబ్బంది చేసిన సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. జాతీయ అవార్డు రావడానికి ఇక్కడి సిబ్బంది సేవలే కారణమన్నారు. సమావేశంలో  లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కురిచేడు ప్రధాన కార్యదర్శి పోలేపల్లి లక్ష్మీనారాయణ, కోశాధికారి గ్రంధిశిల అల్లూరి నాగరాజు, సభ్యులు ఎలిసెట్టి రంగనాయకులు, తల్లం సుబ్రహ్మణ్యం, సూరె గుప్తా, ఇందూరి నరిసిరెడ్డి, వైద్య సిబ్బంది విజయ కుమార్‌, రమేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-18T04:11:52+05:30 IST