ఆహార తనిఖీలకు కదిలారు

ABN , First Publish Date - 2022-01-13T06:10:12+05:30 IST

హోటళ్లు, దుకాణాల్లో తనిఖీలకు ఎట్టకేలకు ఆహార భద్రత అధికారులు కదిలారు.

ఆహార తనిఖీలకు కదిలారు
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీలు చేస్తున్న ఆహారభద్రత అధికారులు

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 12 : హోటళ్లు, దుకాణాల్లో తనిఖీలకు ఎట్టకేలకు ఆహార భద్రత అధికారులు కదిలారు. జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న ఆహార కల్తీలపై బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో  ‘షరా మామూళ్లే’ శీర్షికన కథనం ప్రచురితమైంది. యథేచ్ఛగా కల్తీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందన్న విషయంపై ఉన్నతాధికారులు స్పందించారు. బుధవారం జిల్లా ఆహార భద్రత అధికారి జి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోఆర్టీసీ ఆవరణలోని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్‌ ఉండటాన్ని  గుర్తించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి, జేసీ కోర్టులో పెడుతున్నట్లు ప్రభాకర్‌రావు వివరించారు.







Updated Date - 2022-01-13T06:10:12+05:30 IST