మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్ట్‌.. 24 వాహనాలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-03-17T05:10:52+05:30 IST

పలు ప్రాంతాల్లో బె ౖకులు దొంగతనానికి పా ల్పడుతున్న వ్యక్తిని బుధవారం ఎస్‌ఐ ఫణిభూషణ్‌ మండల కేంద్రం స మీపంలో అరెస్ట్‌ చేసిన ట్లు సీఐ సుధాకర్‌ తెలిపారు.

మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్ట్‌.. 24 వాహనాలు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న బైకులతో సీఐ, ఎస్సై

కొనకనమిట్ల, మార్చి 16 : పలు ప్రాంతాల్లో బె ౖకులు దొంగతనానికి పా ల్పడుతున్న వ్యక్తిని బుధవారం ఎస్‌ఐ ఫణిభూషణ్‌ మండల కేంద్రం స మీపంలో అరెస్ట్‌ చేసిన ట్లు సీఐ సుధాకర్‌ తెలిపారు. స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఆ వివరాలను వెల్లడించారు. తువ్వపాడు గ్రామానికి చెందిన బోడపాటి శ్రీనివాసరావు మద్యానికి, జూదానికి బానిసయ్యాడు.   స్వగ్రామంతో పాటు ఇతర గ్రామాల్లో రూ.10 లక్షల వరకూ అప్పులు చేశాడు. 2012లో మోటార్‌ సైకిళ్ల దొంగతనం కేసులో అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లి శిక్షను అనుభవించినట్లు తెలిపారు. 2014లో కావలి పోలీ్‌సస్టేషన్‌లో మోటర్‌ సైకిళ్ల దొంగతనం కేసులో పట్టుబడి మళ్లీ జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత శ్రీనివాసరావు బైకుల దొంగతనం చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు, కావలి, సింగరాయకొండ, కొండపి, కనిగిరి, ఒంగోలు, చిమకుర్తి, తాళ్లూరు, కొనకనమిట్ల ప్రాంతాల్లో మొత్తం 24 మోటర్‌ సైకిళ్లను చోరీ చేశాడు. వాటి విలువ సుమారు రూ.12లక్షలు విలువ ఉంటుందని సీఐ తెలిపారు. అతను ఇతరులకు అమ్మిన 24 బైకులను స్వాధీనం చేసుకున్నారు. 


రైలు కిందపడి మహిళ మృతి

టంగుటూరు, మార్చి 16 : మండలంలోని అనంతవరం పంచాయితీ పరిధిలోని తాళ్లపాలేనికి చెందిన కోరుట్ల యాదమ్మ(54) బుధవారం సొంత పని మీద టంగుటూరు వచ్చింది. పనిముగించుకుని తిరిగి సొం తూరు వెళ్తుండగా స్థానిక రైల్వేస్టేషన్‌ ప్రధానగేటును దాటుతుండగా స్టేషన్‌ వైపు వస్తున్న రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. 

Read more