15 ఏళ్లుగా నిలిచిన మదర్‌ థెరిస్సా కాలనీ

ABN , First Publish Date - 2022-11-30T21:55:40+05:30 IST

అధికారుల ఉదాసీనత, పాలకుల నిర్లక్ష్యం వెరసి మదర్‌ థెరిస్సా కాలనీలో పక్కా గృహాలు తీరని కలగానే మిగిలాయి. 15 ఏళ్ల కిందట పేదలకు అక్కడ ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అయినా నేటికీ వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

15 ఏళ్లుగా నిలిచిన మదర్‌ థెరిస్సా కాలనీ
అసంపూర్తిగా నిలిచిన ఇళ్ల నిర్మాణాలు

ఆందోళనలో లబ్ధిదారులు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

కంభం, నవంబరు 30 : అధికారుల ఉదాసీనత, పాలకుల నిర్లక్ష్యం వెరసి మదర్‌ థెరిస్సా కాలనీలో పక్కా గృహాలు తీరని కలగానే మిగిలాయి. 15 ఏళ్ల కిందట పేదలకు అక్కడ ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అయినా నేటికీ వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడం దురదృష్టకరం. వివరాల్లోకి వెళితే కందులాపు రం పంచాయతీలో 2007-08 ఎస్సీ, ఎస్టీలు 190 మందికి గృహాల కోసం ప ట్టాలు మంజూరు చేశారు. కాలనీకి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కల్పించకపోవడంతో కేవలం 40 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వీటిలో 30 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినవి పునాదిదశలోనే నిలిచాయి. ప్రస్తుతం కాలనీకి వెళ్లేందుకు రైల్వే స్థలాన్ని వినియోగించడం వలన ఆశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. ఈవిషయంపై గతంలో పలు సంఘాల నాయకులు బాధితుల పక్షాన రెవెన్యూ అధికారులకు తెలిపినప్పటికీ అప్పటి తహసీల్దార్‌ హుస్సేన్‌పీరా మార్కెట్‌యార్డు పక్క నుంచి కాలనీకి వెళ్లేందుకు రోడ్డు మార్గం ఏర్పా టు చేసేందుకు సర్వేయర్‌తో కొలతలు తీయించి చర్యలు తీసుకుంటామన్నా రు. ఇప్పటివరకు 8 మంది కలెక్టర్లు ఈ కాలనీని సందర్శించారు. కాలనీకి రోడ్డు వేసేందుకు స్థలం తీసుకుని సమస్య పరిష్కరిస్తామన్నారు. 15 మందికి పైగా తహసీల్దార్లు మారినా సమస్య తీరలేదు. ప్రస్తుత కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ కూడా ఈకాలనీని సందర్శించారు. కేవలం రోడ్డు లేకపోవడం దారుణమన్నా రు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గృహనిర్మాణానికి సంబంధించిన వస్తువులను తీసుకెళ్లేందుకు దారి లేకుండా పోయిం ది. కాలనీకి వెళ్లేందుకు రోడ్డు ఎప్పుడు వేస్తారోనని లబ్ధిదారులు ఎదురు చూ స్తున్నారు. ఊరి చివర జన సంచారం లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ప్రస్తుతం 30 కుటుంబాల వారు కాలనీలో నిర్మించుకుని ఆ గృహాలలో నివాసముంటున్నారు. 185 గృహాల నిర్మాణానికి మంజూరైన స్థలంలో రోడ్డు సదుపాయం లేక నిర్మాణాలు చేపట్టకపోవడంతో కాలనీ మొత్తం దట్టంగా చిల్లచెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నది. దీనితో రాత్రివేళ విష పురుగులు వస్తున్నాయని, భయంతో నివసిస్తున్నామని సుగుణమ్మ, దానమ్మ తెలిపారు. రోడ్డు లేకపోవడంతో రేషన్‌బండి కూడా రావడం లేదని, మేమే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి రేషన్‌ సరుకులు తెచ్చుకుంటున్నామన్నారు. కాలనీకి రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.

పోరాట ఫలితంగానే స్థలం మంజూరు

గతంలో చేసిన పోరాటాల ఫలితంగా రైల్వేస్టేషన్‌ సమీపంలో ఎస్సీ, ఎస్టీలకు స్థలాలు మంజూరు చే శారు. 2008లో పక్కా గృహాలు మంజూరయ్యాయి. అయితే కాలనీకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ని ర్మాణాలు సాగడం లేదు. ఎంతోమంది కలెక్టర్లను, ఎ మ్మెల్యేలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా కాలనీకి రోడ్డును నిర్మించాలి. లేకపోతే నిరాహార దీక్షకు దిగుతాం.

- శాలెంరాజ్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఆందోళన చేపడతాం

ఎమ్మార్పీఎస్‌ సుదీర్ఘ పోరాటం తరువాత కాలనీకి నీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. కానీ రోడ్డు వేయలేదు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మించకుంటే ఆందోళనకు దిగుతాం.

- కాకర్ల మనోజ్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు

Updated Date - 2022-11-30T21:55:42+05:30 IST