కుటుంబ కలహాలతో తల్లీకూతురు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-29T05:31:46+05:30 IST

కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీకూతురు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగడ్డలో మంగళవారం వెలుగుచూసింది.

కుటుంబ కలహాలతో తల్లీకూతురు ఆత్మహత్య
తల్లీకూతురు మృతదేహాలు

రేగలగడ్డలో విషాదం

మర్రిపూడి, జూన్‌ 28 : కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీకూతురు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగడ్డలో మంగళవారం వెలుగుచూసింది. అందిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన కారంపూడి చిన్నక్క (50), అశ్వని (24) తల్లీకూతుళ్లు. చిన్నక్క భర్త మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో రెండో కుమార్తె అయి న అశ్వనికి గతేడాది కొనకనమిట్ల మండలం వింజవర్తిపాడుకు చెందిన యువకుడితో వివాహమైంది. కొద్దిరోజులు వారి వివాహ బంధం సాఫీగానే సాగిం ది. అనంతరం కుటుంబంలో కలహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అశ్వని తన పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి తల్లీకూతుళ్లు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. సోమవారం సాయం త్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నక్క, అశ్వని రాత్రికి ఇంటికి రాలేదు. దీంతో అనుమానించిన బంధువులు వారికోసం వెతుకులాట ప్రారంభించారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని గుండ్లసముద్రం చెరువు సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్ద చిన్నక్క, అశ్వని చెప్పులు, సెల్‌ఫోన్‌ కనిపించడంతో స్థానికులు అనుమానంతో లోపలికి చూడగా తల్లీకూతుళ్ల మృతదేహాలు కన్పించాయి. వీరిద్దరూ ఒకరికొకరు చున్నీతో గట్టిగా కట్టుకొని బావిలోకి దూకినట్లు అర్థమవుతోంది. సమాచారం అందుకున్న ఎస్సై పి.అంకమరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీయించారు. మృతురాలి చిన్నక్క కుమారుడు చంద్రశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంకమ్మరావు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తల్లీకూతురు మృతితో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. 

Updated Date - 2022-06-29T05:31:46+05:30 IST