సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-07-18T06:29:01+05:30 IST

టీడీపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి
సభ్యత్వాలు అందజేస్తున్న ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జ్‌  ఎరిక్షన్‌బాబు

పెద్దారవీడు(మార్కాపురం), జూలై 17: టీడీపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని తంగిరాలపల్లిలో ఆదివారం టీడీపీ సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నార న్నారు. ప్రతి కార్యకర్త టీడీపీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేయాల న్నారు కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు జడ్డా రవి, మాజీ సర్పంచ్‌ లింగాల అబ్రహం, టీడీపీ నాయకులు షేక్‌.మాబు, తోకల చిన్న ఆవులయ్య, నక్కా శ్రీను, గుమ్మా చిన్న గంగరాజు, కన్నెబోయిన సుబ్బయ్య, కటెపోగు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Read more