సభ్యత్వ నమోదు లక్ష్యాలను అధిగమించాలి

ABN , First Publish Date - 2022-03-18T06:27:44+05:30 IST

టీడీపీ సభ్యత్వ నమోదు లక్ష్యాలను నాయకులు కలిసి కట్టుగా ఉండి అధిగమించాలని ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్‌ జంషీర్‌ అహ్మద్‌ అన్నారు.

సభ్యత్వ నమోదు లక్ష్యాలను అధిగమించాలి
మాట్లాడుతున్న జంషీర్‌ అహ్మద్‌, పువ్వాడి

పామూరు, మార్చి 17: టీడీపీ సభ్యత్వ నమోదు లక్ష్యాలను నాయకులు కలిసి కట్టుగా ఉండి అధిగమించాలని ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్‌ జంషీర్‌ అహ్మద్‌ అన్నారు. స్థానిక పువ్వాడి రాధాకృష్ణ కన్వన్షన్‌హల్‌లో సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం ఏ.ప్రభాకర్‌చౌదరి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి పరిశీలకులుగా షేక్‌ జంషీర్‌ అహ్మద్‌, బ్రహ్మంగౌడ్‌లు హాజరయ్యారు. టీడీపీ సభ్య త్వం తీసుకోవడం ద్వారా ప్రతి కార్యకర్తకు గుర్తింపుతో పాటు రూ.2లక్షల వరకు బీమా వర్తిస్తుందన్నారు. కార్యకర్తకు భరోసా ఏర్పడు తుందన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనివిధంగా కార్యకర్తల బలం టీడీపీకి ఉందన్నారు. ఎన్‌టిఆర్‌ శతజయంతి ఉత్సవాలు, టీడీపీ 40వ ఆవిర్భావం సందర్భంగా జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ 2022-24వ సంవత్సరానికి సంబందించి సభ్యత్వ నమోదును ప్రారంభించారన్నారు. సభ్యత్య నమోదు లక్ష్యాన్ని అధిగమించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేసి సత్కరిస్తామని మండల టీడీపీ అఽధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రి చౌదరి, ఎస్సీసెల్‌ అధ్యక్షులు డోలా శేషాద్రిలు ప్రకటించారు. ముందుగా ఇటీవల మృతి చెందిన  టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు బీవీ బోజయ్యచారి అకాల మృతికి చింతిస్తూ మౌనం పాటిం చారు. అనంతరం టీడీపీ సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్య క్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి కే.సుభాషిణి, మాజీ జడ్పీటీసీ ఎం హుస్సేన్‌రావు యాదవ్‌,  టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి బత్తుల సత్య నారాయణ, పట్టణ కమిటీ అధ్యక్షుడు షేక్‌ ఖాజారహంతుల్లా, జిల్లా షీప్‌ సొసైటి డైరెక్టర్‌ ఎం గంగరాజు యాదవ్‌, ఎం రమణయ్య, ఆర్‌ఆర్‌ రఫీ, ఉప్పలపాటి హరిబాబు, ఎం దొరసానాచారి, ఇర్రి కోటిరెడ్డి, కావిటి సుబ్బయ్య, పాలపర్తి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ ఐటీడీపీ కన్వీనర్లు మద్దిశెట్టి రమాదేవి, రామకృష్ణ, షేక్‌ మస్తాన్‌, ఓ సుబ్బమ్మ, ఆవుల రవణమ్మ, షేక్‌ రహిమున్నిసా, గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షులు, అనుబంద సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పీసీపల్లి : టీడీపీలోని కార్యకర్తలందరూ సభ్యత్వ నమోదు చేయించుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు వేమూరి రామయ్య అన్నారు. ఐటీడీపీ మండల కో ఆర్డినేటర్‌ గోగాడి ప్రవీణ్‌ గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రామాన్ని చేపట్టారు.  కార్యక్రమాన్ని పర్యవేక్షించిన టీడీపీ మండల అధ్యక్షుడు రామయ్య మాట్లాడుతూ గతంలో సభ్యత్వ నమోదు చేయించుకున్నవారు తిరిగి రెన్యువల్‌ చేయించుకోవాలన్నారు. టీడీపీ సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ 2లక్షల రూపాయల ప్రమాదబీమా వర్తించేలా పార్టీ చర్యలు చేపట్టిందన్నారు. ఐటీడీపీ కార్యకర్తలు తమ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మూలె వెంకటేశ్వరరెడ్డి, వెలిది శ్రీను, తిరుపతయ్య తదితరులు ఉన్నారు.

Read more