ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు చర్యలు

ABN , First Publish Date - 2022-01-04T04:36:03+05:30 IST

జిల్లాలోరెడ్‌ క్రాస్‌ సంస్థ ద్వారా పేదలకు అత్యవసర సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు చర్యలు
పాత రిమ్స్‌లో జనరిక్‌ మందుల షాపును ప్రారంభిస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

 కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 3 : జిల్లాలోరెడ్‌ క్రాస్‌ సంస్థ ద్వారా పేదలకు అత్యవసర సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. స్థానిక పాతరిమ్స్‌లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో రెడ్‌క్రా్‌ససంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనరిక్‌ మెడికల్‌షాపును కలెక్టర్‌ సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెడ్‌క్రాస్‌ సంస్థసేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. జనరిక్‌ మందులపై ప్రజలకు అనుమానం అవసరం లేదన్నారు. ప్రైవేటు మెడికల్‌షాపుల్లో దొరికే అన్ని రకాల మందులు జనరిక్‌మెడికల్‌ షాపులో లభిస్తాయన్నారు.  కార్యక్రమంలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, నగర మేయర్‌ గంగాడ సుజాత, జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణవేణి, మోప్మా పీడీ రవికుమార్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి. రత్నావళి, రెడ్‌క్రా్‌ససంస్థ చైర్మన్‌ ఈ.ప్రకా్‌షబాబు, ప్రభాకర్‌, సీవీ రెడ్డి, పి.జనార్దనరావు, ఎం.నరసింహారావు, ఎం. ప్రసన్నరాజు తదితరులు పాల్గొన్నారు. 

కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 3: జిల్లాలో కారు ణ్య నియామకాల కింద పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ  కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ నియామక ఉత్తర్వులు అందజేశారు. స్థానిక కలెక్టరేట్‌లో ని స్పందన హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఎం. శ్రీ శరత్‌కుమార్‌( రెవెన్యూ), జి.సాయికిరణ్‌(రెవెన్యూ), ఎల్‌.రవితేజ( ప్రభుత్వమెడికల్‌ కాలేజీ), డి నరేష్‌( ఎక్సైజ్‌శాఖ), ఎస్‌. సందీ్‌పరెడ్డి(మెడికల్‌ కాలేజీ), ఆర్‌. వెంకట నితీ్‌ష(గ్రౌండ్‌వాటర్‌ అండ్‌ ఆడిట్‌), కె.ఆనంద్‌మోహన్‌ (గిద్దలూరు ఫారెస్టు ఆఫీసు), జి.సంధ్య   (రెవెన్యూ), పాలపర్తిజ్యోతి( బీసీవెల్ఫేర్‌) కార్యాలయంలో ఉద్యోగాలు కల్పిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు టీఎ్‌స చేతన్‌, విశ్వనాఽథన్‌, డీఆర్వో పులి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-04T04:36:03+05:30 IST