నవరాత్రుల్లో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం

ABN , First Publish Date - 2022-10-03T06:07:18+05:30 IST

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతక క్షేత్రంలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో ఆదివారం వైభవంగా జరిగాయి.

నవరాత్రుల్లో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం
గిద్దలూరులో సామూహిక అక్షరాభ్యాసం

త్రిపురాంతకం, అక్టోబరు 2: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతక క్షేత్రంలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో ఆదివారం వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించా రు. అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి మంగళవాయిద్యాలు, అభిషేకాలు, గోపూజ, ప్రాతఃకాలపూజ, బాలబోగం, సప్తశతి పారా యణం, బాలపూజ, ప్రదోష కాలపూజ నిర్వహించారు. మూలానక్షత్రం కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దూపాటి పాలంక ప్రసాదుశర్మ, ఫణీంద్రకుమార్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర మాజీ మంత్రి సిద్దా రాఘవరావు దంపతులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చనలు నిర్వహించారు. వాస వీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పూజలు నిర్వహించారు. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు శ్రీసరస్వతీదేవిగాదర్శనమిచ్చారు.

గిద్దలూరు, అక్టోబరు 2 : శరన్నవరాత్రులలో భాగంగా పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం మూలానక్షత్రం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల చేత అమ్మవారికి పూజలు చేయించారు. 102 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీ నవోదయ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు చీతిరాల ప్రసాద్‌  దేవస్థాన కమిటీ అధ్యక్షుడు జి.సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు శివపురం ఆంజనేయులు, వాడకట్టు రంగసత్యనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా షరాఫ్‌ బజారులోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారు పరశురామ అలంకారంలో దర్శనమిచ్చారు.

Read more