ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్కాపురం

ABN , First Publish Date - 2022-03-06T05:06:35+05:30 IST

మార్కాపురం ప్రాంతం రాబోయే రోజుల్లో ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారనుందని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.

ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్కాపురం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం, మార్చి 5: మార్కాపురం ప్రాంతం రాబోయే రోజుల్లో ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారనుందని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాయలంలో శనివారం మార్కాపురానికి నూ తనంగా మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని రెండు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు రాబోయే విద్యా సంవత్సరం నుంచి జూ నియర్‌ కళాశాలలుగా మారుతున్నాయన్నారు. పశ్చిమ ప్రాంత వెను కబాటు తనాన్ని గుర్తించే ఇక్కడ వైద్య కళాశాలను మంజూరు చేశార న్నారు. సమావేశంలో ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, ఒంగోలు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కల్యాణి, మున్సిపల్‌ చైర్మన్‌ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, కమిషనర్‌ నయీమ్‌ అహమ్మద్‌, తహసీల్దార్‌ ఏలీషాబాబు, కౌన్సిలర్లు, న్యాయ వాదులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన 

మండలంలోని కొండేపల్లిలో రూ.2 కోట్లతో నిర్మించనున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే కుందురు  శనివారం శంకుస్థాపన చేశారు. కార్య క్రమంలో ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ నాగేశ్వరరావు, ఏడీ వెంకటే శ్వ ర్లు, ఎంపీపీ పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి, జడ్పీటీసీ బాపనరెడ్డి, ఎంపీటీసీ కుందురు మల్లారెడ్డి, నాయకులు కుందురు వెంకటరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-06T05:06:35+05:30 IST