వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-21T06:19:46+05:30 IST

ఉరివేసుకొని వివాహిత ఆత్యహత్యకు పా ల్పడింది. ఈసంఘటన స్థానిక వడ్డెరపాలెంలో శనివారం చోటుచేసుకుం ది. సింగరాయకొండ మండలం శానంపూడికి చెందిన శిరీషకు(27)కు 8ఏళ్ల క్రితం టంగుటూరుకు చెందిన బురుసు మనోహర్‌తో వివాహం జ రిగింది.

వివాహిత ఆత్మహత్య

 

టంగుటూరు, ఆగస్టు 20 : ఉరివేసుకొని వివాహిత  ఆత్యహత్యకు పా ల్పడింది. ఈసంఘటన స్థానిక వడ్డెరపాలెంలో శనివారం చోటుచేసుకుం ది. సింగరాయకొండ మండలం శానంపూడికి చెందిన శిరీషకు(27)కు 8ఏళ్ల క్రితం టంగుటూరుకు చెందిన బురుసు మనోహర్‌తో వివాహం జ రిగింది. వీరికి ఇరువురు సంతానం. నాలుగేళ్ల క్రితం వరకు వీరు తాపీ పని చేసుకుంటూ హైద్రాబాద్‌లో నివాసం ఉండేవారు. నాలుగేళ్ల నుంచి టంగుటూరులోని శ్రీనివాసకాలనీలో ఉంటున్నారు. గతంలో భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలున్నట్లు సమాచారం. వీరిరువురికి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చిన్నట్లు తెలిసింది. రోజూలాగానే పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. ఇంట్లో ఎ వరూ లేని సమయంలో శిరీష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సా యంత్రం పిల్లలు, మామ రాములు ఒకేసారి ఇంటికి వచ్చారు. ఇంటి త లుపు వేసిఉండటంతో తీసేందుకు ప్రయత్నించగా లోపల గడి వేసి ఉం ది. దీంతో కిటికీలో నుంచి లోపలికి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. కిటిలోనుంచి కర్ర సాయంతో గడి తీశారు. లోపలికెళ్లి పరిశీలించగా శిరీష మృతి చెంది ఉంది. ఆమె మేనమామ శ్రీనివాసరావు ఫిర్యాదుమేరకు ఎస్సై ఖాదర్‌బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read more