చెత్త నుంచి ఎరువును తయారు చేయాలి

ABN , First Publish Date - 2022-03-06T05:09:06+05:30 IST

గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యా ర్డులలో చెత్త నుంచి ఎరువులను తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి అన్నారు.

చెత్త నుంచి ఎరువును తయారు చేయాలి
రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి

బేస్తవారపేట, మార్చి 5 : గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యా ర్డులలో చెత్త నుంచి ఎరువులను తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి  జీవీ నారాయణరెడ్డి అన్నారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను సంపద కేంద్రానికి తరలించాలన్నారు. అక్కడ తడి, పొడి చెత్త ను వేరు చేసి ఎరువులను తయారు చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల్లో అలసత్వం వహిస్తే కార్యదర్శులపై చర్యలు తప్పవని నారాయణరెడ్డి హెచ్చరించారు.  శనివారం బేస్తవారపేట, చెట్టిచెర్ల సచివాలయాలను పరిశీలించారు. సచివాలయాల్లోని రికార్డులు పరిశీలించి రికార్డులు మెరుగుపరిచేందుకు తగు సూచనలు ఇచ్చారు. కార్యదర్శులు ఇంటి పన్నును నూరు శాతం ఈనెలాఖరులోగా వసూలు చేయాలని అదేశించారు. ఓటీఎస్‌ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.  కార్యక్ర మంలో ఎంపీడీవో కె.కవితాచౌదరి పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-06T05:09:06+05:30 IST