పక్కా ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-02-20T04:17:56+05:30 IST

శ్రీశైలంలో ని ర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా దోర్నాలలో పక్కాగా ఏర్పాట్లు చే యాలని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సు రేష్‌ అన్నారు.

పక్కా ఏర్పాట్లు చేయాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సురేష్‌

శివరాత్రి సమీక్షలో మంత్రి సురేష్‌

పెద్ద దోర్నాల, ఫిబ్రవరి 19 : శ్రీశైలంలో ని ర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా దోర్నాలలో పక్కాగా ఏర్పాట్లు చే యాలని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సు రేష్‌ అన్నారు. స్థానిక బొగ్గరపు సత్యమమ్మ కల్యాణ మండపంలో మార్కాపురం ఆర్‌డీవో లక్ష్మీశివజ్యోతి అధ్యక్షతన శివరాత్రి పర్వదినాన్ని పురస్కురించుకని శ్రీశైలం వెళ్లే భక్తులకు దోర్నాలలో తాత్కాలిక వసతులు కల్పించేందుకు అ న్ని శాఖల అధికారులతో శనివారం మంత్రి  సురేష్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణ భార తదేశంలో అత్యంత ప్రాముఖ్యత కల్గిన శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు భక్తులు లక్షల సంఖ్యల్లో వస్తారన్నారు. ఈ క్రమంలో దోర్నాలలో రద్దీ ఎక్కువగా ఉంటుంద ని వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. శ్రీశైలం దేవస్థాన ఈవో లవన్న మాట్లాడుతూ దోర్నాల నుంచే భక్తులకు ఆధ్యాత్మికతను పెంపొందించేలా నటరాజ్‌ ముఖ ద్వారానికి రంగులు వేసి వి ద్యుధీపాలంకరణకు తమ వంతు సహాయాన్ని అందిస్తామన్నారు. డీఎస్పీ కిశోర్‌ కుమార్‌ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో భక్తు లు శాంతి భద్రతలతో క్షేమంగా వెళ్లి దైవదర్శనానంతరం తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు అవసర మైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.పంచాయతీ కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడు తూ భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, పారిశుధ్య పనులు చేపడతామని తెలిపారు. పలు ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వైద్యాధికారులు శ్రీని వాస్‌, భరద్వాజ చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సరిపడా ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఆ శాఖాధికారి తెలిపారు. స మావేశంలో తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపీ డీవో శర్మ, రేంజి అధికారి విశ్వేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ భ్రమరాంబికాదేవి, ఆయా శాఖ ల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-02-20T04:17:56+05:30 IST