మద్యం దుకాణాల్లో అరకొరగా నిల్వలు

ABN , First Publish Date - 2022-06-28T05:00:44+05:30 IST

మద్యం షాపులలో నిల్వలు అరకొరగా ఉండటంతో బెల్ట్‌ షాపుల నిర్వహకులకు కాసుల పంట పండుతోంది.

మద్యం దుకాణాల్లో అరకొరగా నిల్వలు
అద్దంకి పట్టణంలోని బెల్ట్‌ షాపులో ఇటీవల పట్టుబడ్డ మద్యం(ఫైల్‌)

బెల్ట్‌ షాపులలో మద్యంకు డిమాండ్‌

సొమ్ము చేసుకుంటున్న నిర్వహకులు

అద్దంకి, జూన్‌ 27: మద్యం షాపులలో నిల్వలు అరకొరగా  ఉండటంతో బెల్ట్‌ షాపుల నిర్వహకులకు కాసుల పంట పండుతోంది. పక్షం రోజులుగా  షాపులకు మద్యం సరఫరా  బాగా తగ్గింది. ఎక్కువ మంది తాగే బ్రాండ్‌లు దొరకటం లేదు. దీంతో ఎక్కువ ధర ఉండే బ్రాండ్‌లను కొనుగోలు చేయాల్సి వస్తుందని మందుబాబులు వాపోతున్నారు. దీనిని  బెల్ట్‌ షాపుల నిర్వహకులు సొమ్ము చేసుకుంటు న్నా రు. పేద, మధ్యతరగతి మందుబాబులు సాధారణం గా 9 సీ హార్స్‌, ఆంధ్రా గోల్డ్‌,  గుడ్‌ ఫ్రెండ్స్‌, హైదరా బాద్‌ బ్లూ, మంజీర, ఏసీ  బ్లాక్‌, కింగ్స్‌ వెల్‌ తదితర బ్రాండ్‌లకు చెందిన రూ.120 నుంచి రూ.150  ఉండే  మద్యం కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆ బ్రాండ్‌ లు ప్రభుత్వ మద్యం దుకాణాలలో అందుబాటులో  ఉండటం లేవు. దీంతో రూ.350 నుంచి రూ.375  ఉం డే మద్యం బ్రాండ్‌ లను కొనుగోలు చేయాల్సి వస్తుం దని వాపోతున్నారు. 

అయితే, పలు బెల్ట్‌ షాపుల నిర్వహకులు మాత్రం తమకు  ఉండే పరిచయాలతో ప్రభుత్వ  దుకాణాల లో కొద్దో గొప్పో నిల్వలను  తీసుకువచ్చి ఇష్టాను సారం ధర పెంచి అమ్మకాలు చేస్తున్నారు. రూ.120 నుంచి రూ.150 ఉండే బ్రాండ్‌ల మద్యంను బెల్ట్‌ షాపులలో రూ.200 నుంచి రూ.250 వరకు అమ్ము తున్నారు. ఇక ప్రభుత్వ మద్యం  దుకాణాలలో నిల్వ ఉన్న ఎక్కువ ధర ఉండే బ్రాండ్‌లను మాత్రమే అ మ్ముతున్నారు. దీంతో కిక్కు కోసం మద్యం దుకాణం వద్దకు వెళ్ళిన మందు  బాబులకు దుకాణంలో ఉండే  బ్రాండ్‌లు చూసి ఒక్కసారిగా తెల్లముఖం వేస్తు న్నారు. ఏళ్ల  తరబడి నిల్వ ఉన్న బ్రాండ్‌ లు ఇప్పుడు ఖాళీ అవుతున్నాయి. 

ఇక బెల్ట్‌ షాపుల నిర్వహకులు అంది వచ్చిన అ వకాశాన్ని సొమ్ము  చేసుకుంటున్నారు.  ఒక్కో బాటి ల్‌కు రూ.50 నుంచి రూ.వంద వరకు  అదనంగా అమ్ముతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అధికారు ల పర్యవేక్షణ లేకపోవటం, మామూళ్ల మత్తులో ము నిగి  తేలుతుండటంతో బెల్ట్‌ షాపులు యథేశ్ఛగా సా గుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాలతో పాటు పట్టణాలలో కూడా ప్రభుత్వ మద్యం దుకా ణాలకు సమీపంలోనే సమాంతరంగా  బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నారు అంటే అధికారులు ఏ స్థాయిలో ఉదాసీనంగా ఉన్నారో ఇట్టే అర్థం అవుతుంది.


Updated Date - 2022-06-28T05:00:44+05:30 IST