భక్తిశ్రద్ధలతో ముగిసిన ఖాశింస్వామి పీర్లపండగ

ABN , First Publish Date - 2022-08-15T06:20:49+05:30 IST

మండలంలోని బాదినేనిపల్లి గ్రామంలో నాలుగు రోజుల నుంచి జరిగిన రెడఖాశీం స్వామి పీర్ల పండుగ మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి.

భక్తిశ్రద్ధలతో ముగిసిన ఖాశింస్వామి పీర్లపండగ
వేడుకల్లో పాల్గొన్న గ్రామస్థులు

కొమరోలు, ఆగస్టు 14: మండలంలోని బాదినేనిపల్లి గ్రామంలో నాలుగు రోజుల నుంచి జరిగిన రెడఖాశీం స్వామి పీర్ల పండుగ మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పీర్లు స్నానానికి వెళ్లడంతో కార్యక్రమాలు ముగిం చారు. తెల్లవారు ఝామున పీర్లను చావిడి ముందున్న గుండం చుట్టూ సందడి చేశారు. పీర్లకు ఉదయం రెడపానకం ఇచ్చే కార్యక్రమం, గుండం చుట్టూ పీర్లను ఎత్తుకునేందుకు నియమనిష్టలతో ఉండి పండుగను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం పిల్లలులేనివారు, అనారోగ్యంతో బాధపడే వారు ఇక్కడ విశేష పూజలు చేశారు. 

ప్రత్యేక ప్రార్థనలు చేసిన అశోక్‌రెడ్డి

శ్రీరెడ ఖాశీం స్వామి పీర్ల పండుగ మహోత్సవాల సందర్భంగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదివారం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. స్వాముల వారిని దర్శించుకుని నైవేథ్యాన్ని సమర్పించి. చదివింపులు చెల్లించారు. అనంతరం గ్రామనాయకుడు ముత్తుముల యల్లారెడ్డి గృహంలోని కార్యక్రమానికి హాజరయ్యారు.  వీరివెంట టీడీపీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేఽశ్వర్లు, ముత్తుముల క్రిష్ణకిషోర్‌రెడ్డి, నాయకులు బిజ్జాల తిరుమలరెడ్డి, వెంకట్రామి రెడ్డి, చలిచీమల శ్రీనివాసచౌదరి, గోపాలక్రిష్ణ యాదవ్‌, గుర్రం క్రిష్ణబాబు పాల్గొన్నారు.

స్వామి వారి లడ్డు రూ.25,500

శ్రీ రెడఖాశీం స్వామి వారి ప్రసాదలడ్డు వేలంపాటలో నంద్యాల పట్టణానికి చెందిన జోగిపర్తి సుబ్రహ్మణ్యం  బ్రదర్స్‌ వెంకట రమణ, రామయ్యలు రూ.25,500లకు వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. లడ్డును దక్కించుకున్న వారిని మేలతాళాలతో గ్రామం లోని గృహానికి పంపారు.


Read more