కలగట్ల.. ప్రజా సమస్యలు తీరేదెట్లా..?
ABN , First Publish Date - 2022-11-08T23:10:59+05:30 IST
కనిగిరి పట్టణానికి సమీపాన అదో కుగ్రామం. ప్రతి అవసరానికి తెల్లవారితే కనిగిరికి వెళ్లాల్సిన పరిస్థితి ఆ గ్రామస్థులది.
మోక్షం కోసం ఎదురు చూపులు
వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు
రాత్రి వేళల్లో రోగమొస్తే పైకి పోవాల్సిందే
హామీలను గాలికొదిలేసిన వైసీపీ నేతలు
కనిగిరి, నవంబరు 8 : కనిగిరి పట్టణానికి సమీపాన అదో కుగ్రామం. ప్రతి అవసరానికి తెల్లవారితే కనిగిరికి వెళ్లాల్సిన పరిస్థితి ఆ గ్రామస్థులది. కనిగిరికి అతి సమీపాన ఉన్న కలగట్ల గ్రామం. కనీస రవాణా సౌకర్యం సరిగ్గా లేదు. కలగట్ల ప్రజలు స మస్యలతో సతమవుతున్నారు. మా సమస్యలు తీరేదెట్లా అంటు న్నారు. హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న ప్రస్తుత వైపీపీ నేత లు పత్తా లేరని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
ఏళ్ల తరబడి గతుకుల రోడ్డే దిక్కు
కనిగిరికి 7కి.మీ ఉన్న కలగట్ల గ్రామానికి గతుకుల రోడ్డే దిక్క యింది. వర్షాకాలంలో కనిగిరి వెళ్లాలంటే నానా అవస్థులు పడా ల్సిందే. ఎన్నో సార్లు ఆ గతుకుల రోడ్డుపై వాహన చోదకులు పడిన సంద ర్భాలు ఉన్నాయి. ప్రతి అవసరానికి కనిగిరికి వెళ్లాల్సిన ఈ గ్రామ రోడ్డు బా గులేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. ఆటోలే దిక్కు. ఆ రోడ్డుపై ఆటోల్లో రావాలంటే ఒళ్లంతా హూ నమయ్యే పరిస్థితి. పదేళ్ల క్రితం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి చొరవతో గ్రామంలో కొంత అభివృద్ధి జరిగింది. అప్పట్లో కని గిరి కొత్తూరు మలుపు వద్ద నుంచి ఆ గ్రామానికి తారు రోడ్డు వేయిం చేందుకు కంకరు రాళ్లతో గ్రామానికి రోడ్డు వేయించారు. అప్పట్లో ఎన్నికలు రావడంతో రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదు. గతకుల రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తున్నారు.
రాత్రి వేళ రోగమొస్తే పైకి పోవలిసిందే
రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు కలగట్లలో నివాసముంటున్నాయి. పాడి, పంటలతో వచ్చే ఆదాయమే వారి జీవనస్థితి. దాదాపూ 800కు పైబడి జనాభా, 200కు పైగా గృహాలు, 670 మంది ఓటర్లు, 50 మంది కూడా విద్యావంతులు నిండా లేని కుగ్రామం. కుటుంబ యజమానులు అధిక శాతం బేల్దారి పనుల కోసం తెలం గాణ, మద్రాసు, బెంగళూరు ప్రాంతాలకు వలసలు వె ళ్లారు. ముసలి, ముతక వారి పిల్లల పిల్లలను, ఇంటిని కని పెట్టుకుని పాడి గేదెలతో, వ్య వసాయం చేసుకుంటూ జీ వనం సాగిస్తుంటారు. ఆ ము సలి ముతకకు అనారోగ్యం ఏ ర్పడితే, రాత్రి వేళల్లో అయితే అంతే సంగతులు. ఆ గ్రా మంలో ఉన్న 3 ఆటోలే ది క్కు. అవి కూడా రాత్రి వేళల్లో కనిగిరికి వెళ్లాలంటే అధి క మొత్తాలను వసూలు చే స్తారు. దీంతో రోగంతో సత మతమవుతూ వృద్ధులు ప్రా ణాల మీదికి తెచ్చుకునే పరి స్థితి నెలకొంటుంది.
అధికారంలోకి వస్తే రోడ్డు వేస్తామన్నారు
ఎన్నికల ముందు వైసీపీ నాయకులు గ్రామానికి ప్రచారానికి వచ్చారు. దండాలు పెట్టారు. అధికారంలోకి రాగానే మొదటగా రోడ్డును వేస్తామని హామీ ఇచ్చారు. అంతే అప్పటి నుంచి పత్తా లేరు. చాలా సార్లు పాలకులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఈ సారి ఓటు అంటూ వస్తే పేడ నీళ్లు చల్లుతామంటూ మహిళలు, వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- మరియమ్మ, కలగట్ల గ్రామం
పరిస్థితి దారుణం
గ్రామంలో దాదాపూ 200 మంది వరకు నిత్యం కనిగిరికి వివిధ అవసరాల నిమి త్తం వెళ్లివస్తుంటారు. గ్రామంలో నాతో పా టు మరో 2 ఆటోలు ఉన్నాయి. మా 3 ఆటోలు మూడు చొప్పున ట్రిప్పులు వేస్తాం. ఒక్కో ఆటోకు రూ.300 మించి రాదు. గతుకుల రోడ్డులో ఆటో వెళ్లాలంటే రోజూ టైర్లు పగులుతున్నాయి. పంచర్లు అవుతున్నాయి. తరచూ రిపేర్లు వస్తున్నాయి. వచ్చే రూ.300తో ఇంటిని నడపాలా, ఆటో మరమ్మతులకు పెట్టాలో అర్థంకావడం లేదు. ఆదాయం లేక వ్యవసాయం చేసుకుంటూ ఆటో నడుతపుతున్నాను. పాలకులు గ్రామానికి తారు రోడ్డు వేయాలి.
- మల్లికార్జునరెడ్డి, ఆటో డ్రైవర్