జగన్‌రెడ్డి అస్తవ్యస్త పాలనకు జనమే బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2022-10-08T05:35:27+05:30 IST

సీఎం జగన్‌రెడ్డి అస్తవ్యస్త విధానాలు వ్యతిరేకించటంతో సరిపోదని తగిన సమయంలో జనమే బుద్ధి చెప్పాలని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.

జగన్‌రెడ్డి అస్తవ్యస్త పాలనకు జనమే బుద్ధి చెప్పాలి
రిలే దీక్షలో ఉగ్రతోపాటు సీఎ్‌సపురం మండల టీడీపీ నాయకులు


టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, అక్టోబరు 6 : సీఎం జగన్‌రెడ్డి అస్తవ్యస్త విధానాలు వ్యతిరేకించటంతో సరిపోదని తగిన సమయంలో జనమే బుద్ధి చెప్పాలని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌ వద్ద ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు తొలగించే నిర్ణయాన్ని జగన్‌రెడ్డి తీసుకోవటాన్ని నిరసిస్తూ డాక్టర్‌ ఉగ్ర ఆధ్వర్యంలో 8వ రోజు సీఎ్‌సపురం మండల టీడీపీ శ్రేణులు రిలే  దీక్ష లు చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ చరిత్రలో తుగ్లక్‌ అనే రాజు ఉండేవాడని, అతని పాలనలో దిక్కుమాలిన విధానాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గాలు ఉండేవన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పాలనే నడుస్తోందని ఆరోపించారు. నాటి తుగ్లక్‌ను ఎవరూ చూడలేదు కానీ, నేటి తుగ్లక్‌ జగన్‌ను అందరూ చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ప్రజలే జగన్‌ రాక్షస పాలనకు అంతం మొందించేలా పనిచేయాలని కోరారు. మహామనిషిగా తెలుగు ప్రజ లు ఆరాదించే ఎన్టీఆర్‌ పేరును యూనివర్సిటీ నుంచి తొలగించడం దుర్మార్గ చర్యగా పేర్కొన్నారు. రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, పెన్నానాయగయ్య యాదవ్‌, బారాయిమాం (సిద్ధాంతి) మూలె బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. 

నిరసన కార్యక్రమానికి భారీగా వచ్చిన సీఎ్‌సపురం శ్రేణులు

కనిగిరికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీఎ్‌సపురం మండలం నుంచి రిలే నిరాహార దీక్షా కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు, నాయకులు భారీగా తరలివచ్చారు. సీఎ్‌సపురం మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు, టౌన్‌ పార్టీ అధ్యక్షుడు పోకల రవిచంద్ర, సీనియర్‌ నాయకులు ఎన్‌.సి.మాలకొండయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. 

ఈ కార్యక్రమంలో నాయకులు పునుగుపాటి రవికుమార్‌, షేక్‌ రజబ్‌బాషా, ఎస్సీసెల్‌ నాయకులు దాసరి మల్లికార్జున, సర్పంచ్‌ శ్రీరాం పద్మావతి, ఎ.కొత్తపల్లి సర్పంచ్‌ ముప్పాళ్ళ శ్యామల, అంబవరం సర్పంచ్‌ కె.కొండయ్య, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లికార్జున, మాజీ సర్పంచ్‌లు ఎన్‌.సీ.మాలకొండయ్య, ఉపసర్పంచ్‌ పాములపాటి నర్సయ్య, అట్లూరి రామకృష్ణంరాజు, బండారు వెంకటాద్రి, పెరుగుపల్లి వెంకటరెడ్డి, టౌన్‌ యూత్‌ అధ్యక్షుడు బత్తు శ్రీను, మహిళా అధ్యక్షురాలు జగన్నాథం లక్ష్మీదేవి, రుసుం షాను, ఇండ్లా లక్ష్మణ్‌, ఇండ్ల శ్రీను, చౌడా తిరుపతిరెడ్డి, వేంపాటి కాశయ్య, గుంటిమడుగు వెంకటరమణ, మద్దులూరి వెంకరాజు, కేవై ఏసురత్నం, గుంటిమడుగు కృష్ణంరాజు, రుద్రంరాజు రాజేంద్రరాజు, మాదినేని శ్రీనివాసులు, కేశనపల్లి ఏసుదాసు, దరిశి సాగసురేష్‌, సుబ్బరాయుడు, చావా కాశినాధ్‌, చావా వెంకటసుబ్బయ్య, తిరుపతిరెడ్డి, చీర్లదిన్నె సుబ్బయ్య, చందలూరి చినకాశయ్య, తమ్మిశెట్టి రోశయ్య, పఠాన్‌ నాయబ్‌రసూల్‌, కోనంగి వెంకట కొండయ్య, బండారి వెంకటేశ్వర్లు,  పోకల రవిచంద్ర, వెంకటయ్య, హజరత్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T05:35:27+05:30 IST