ధరలు తగ్గించకపోతే పోరాటమే

ABN , First Publish Date - 2022-05-24T05:56:09+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు నియం త్రిం చకపోతే పోరాడుతామని ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు గుజ్జుల బాలిరెడ్డి అన్నారు.

ధరలు తగ్గించకపోతే పోరాటమే

కనిగిరి, మే 23 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు నియం త్రిం చకపోతే పోరాడుతామని ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు గుజ్జుల బాలిరెడ్డి అన్నారు. దర్శి చెంచయ్య భవనంలో సోమవారం ధర్నా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అటు బీజేపీ, ఇటు వైసీపీ పాలకులు పోటీపడి ధరలు, పన్నులు పెంచి పేదల నడ్డివిరుస్తున్నారని ధ్వజ మెత్తారు. జగన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలను, రాష్ట్రాన్ని ముం చేస్తున్నాడని, ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. కలెక్టరేట్‌ వద్ద 30వ తేదీన జరిగే ధర్నాలో సీపీఐ, ఏఐటీయూసీ శ్రేణులు పాల్గొనాలని కోరా రు. కార్యక్రమంలో  సీపీఐ శాఖ కార్యదర్శి యాసిన్‌,  జీపీ రావు, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, సుజాత, యోహాను పాల్గొన్నారు. 

Read more