పసుపు సాగుపై రైతుల ఆసక్తి

ABN , First Publish Date - 2022-08-09T05:17:58+05:30 IST

వరి సాగును విర మించుకుంటున్న రైతులు ఇతర పంట ల సాగు వైపు దృష్టిపెట్టారు.

పసుపు సాగుపై రైతుల ఆసక్తి
కలవకూరు వద్ద సాగుచేస్తున్న పసుపు

అద్దంకి, ఆగస్టు 8: వరి సాగును విర మించుకుంటున్న రైతులు ఇతర  పంట ల సాగు వైపు దృష్టిపెట్టారు. ఈక్రమం లో కొందరు రైతులు పసుపు సాగుకు మొగ్గు చూపుతున్నారు. గత దశాబ్దకా లంగా అద్దంకి మండలంలోని కొత్తరెడ్డి పాలెంలో పసుపు సాగు చేస్తున్నారు. మార్కెటింగ్‌ కోసం తొలుత కొంత ఇబ్బం ది పడ్డా గత రెండు మూడు సంవ త్సరా లుగా వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో పాటు ప్రభు త్వం కూడా అద్దంకిలో పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయటం తో ఆ సమస్య కూడా లేకుండా పోయింది. దీనికితోడు ఖచ్చితమైన రా బడి ఉండటం, ఎట్టి పరిస్థితులలో నష్టం వచ్చే అవకాశం లేకపోవటం తో రైతులు ఆసక్తి చూపుతున్నారు.

ఈనేపథ్యంలో కొత్తరెడ్డిపాలెంతో పాటు శంఖవరప్పాడు, కలవకూరు తదితర గ్రామా లలో కూడా సాగు చేస్తున్నారు. సుమారు 300 ఎకరాలలో పసుపు సాగు చేస్తున్నారు. దిగుబడి 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు వ చ్చే అవకాశం ఉంది. ధర కూడా క్వింటా రూ. 6 వేలకు పైగానే ఉంటుంది. దీంతో సుమారు రూ.2 లక్షల  వరకు  ఆదాయం వచ్చే అవకా శం ఉంది. ఖర్చు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు కనీసం రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు మిగిలే అవ కాశం ఉందని రైతులు అభిప్రా యపడుతున్నారు. మరికొన్ని గ్రామాలలో కూడా పసుపు సాగుపై ఆసక్తి చూపుతూ కొంతమేర సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యం లో పసుపు సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. 

Updated Date - 2022-08-09T05:17:58+05:30 IST