అమానవీయం!

ABN , First Publish Date - 2022-08-16T03:59:02+05:30 IST

అమానవీయం!

అమానవీయం!

కూతురిపైనే లైంగిక వేధింపులు

బాధితురాలి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు

వెలిగండ్ల, ఆగస్టు 15 : కన్నకూతురిని తండ్రే లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన మండలంలోని పూలికుంట్ల గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..  గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ము గ్గురు సంతానం. బేల్దారి పనులు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌లో భార్యాపిల్లలతో ఉంటున్నాడు. 2020 వరకు రెండో కుమార్తె చెన్నైలోని ఓ మెస్‌లో పనిచేసింది. కరోనా సమయంలో మెస్‌ మూసివేయడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. అప్పటినుంచి తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని చేష్టలతో విసుగు చెందిన బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. పెద్దకొడుకు వివాహ పనుల నిమిత్తం కుటుంబమంతా 20రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా వేధింపులకు పాల్పడు తుండటంతో తల్లీకుమార్తె ఆదివారం వెలిగండ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ విశ్వనాథ్‌ తెలిపారు. సోమవారం గ్రామంలో దర్యాప్తు చేపట్టారు. 

Read more