జే ట్యాక్స్ భయంతో పరిశ్రమలు పరార్
ABN , First Publish Date - 2022-12-07T21:59:28+05:30 IST
జే ట్యాక్స్ భ యంతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పరారవు తున్నాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గడికోటలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి
గిద్దలూరు, డిసెంబరు 7 : జే ట్యాక్స్ భ యంతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పరారవు తున్నాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని గడికోట గ్రామంలో బుధవారం రాత్రి ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం ని ర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఇం టింటికీ వెళ్లి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. వైసీపీ వచ్చాక ఎక్కడా అభివృద్ధి పనులు చేయలేదని, ప్రజావ్యతిరేక విధానాలతో జగన్‌రెడ్డి నియంతలా పాలన సాగిస్తున్నారని అశోక్‌రెడ్డి ధ్వజమె త్తారు. జే ట్యాక్స్ భయంతో పరిశ్రమలు పరార వుతున్నాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో పెట్టలేదన్నారు. దీంతో నిరుద్యోగ యువత పొరుగు ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఉన్న కంపెనీలను కూడా జే ట్యాక్స్ పేరుతో భయాందోళనకు గురిచే స్తున్నారన్నారు. ఎన్నికలలో హామీ ఇచ్చిన వి ధంగా జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని ప్రశ్నించా రు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులతో వింత, వికృత చేష్టలు, దాడులతో ప్రజలు విసిగెత్తిపోయారని పేర్కొన్నారు. మూడున్నర ఏళ్లు గడిచినా లక్ష ఉద్యోగాల హామీ గాలిలో కలిసిపోయిందన్నా రు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలివేసి జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారని, రా బోయే ఎన్నికలలో వైసీపీని ఓటుతో తరిమికొట్టాలని అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్ర కార్యక్రమంలో టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ రామసుబ్బయ్య, కొమ్మునూరు సర్పంచ్ రామసుబ్బారె డ్డి, తిమ్మాపురం సర్పంచ్ మల్లీశ్వరయ్య, టీడీపీ నాయకులు నరసింహులు, వెంకటేశ్వర్లు, బి. వెంకటేశ్వర్లు, మునయ్య, షెక్షావలి, కిరణ్‌గౌడ్, బాలయ్య, చంద్రశేఖర్‌యాదవ్, శ్రావణ్ పాల్గొన్నారు.
పెద్దారవీడులో..
పెద్దారవీడు : మండలంలోని సిద్ధినా యు నిపల్లెలో బుధవారం రాత్రి ఇదుం ఖర్మ రా ష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ వైపాలెం ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడారు. జగన్‌రెడ్డిని సాగనంపితేనే రాష్ట్రం, ప్రజలు బాగుపడతారని అ న్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకు రావాలని కోరారు. కార్యక్రమలో టీడీపీ మండ ల అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ లింగాల అబ్రహం, నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.